Bullet Train To Moon: ఇక చంద్రుడి మీదకు బుల్లెట్ ట్రైన్..!
Bullet Train To Moon: సాధారణ ట్రాక్‌ల మీద ప్రయాణించే బుల్లెట్ రైళ్ల గురించి వినేసాం. ఇందులో కొత్తగా ఏముందని ఇప్పుడు అండర్ వాటర్ బుల్లెట్ రైళ్లు వచ్చేసాయి. ఇలాంటి బుల్లెట్ రైలు ఒకటి మన దేశంలోనే వెస్ట్ బెంగాల్లో ఉంది. నేలపై, నీటిలో కాదు.. మేం ఏకంగా చందమామ మీదికే బుల్లెట్ రైలుని పంపుతాం అని వినూత్నంగా ఆలోచించింది జపాన్.
ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రైల్వే ట్రాక్ ద్వారా ఈ బుల్లెట్ రైలును నిర్మిస్తారట. దీని వేగం శబ్దానికంటే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది చూడటానికి మాత్రం కాస్త విమానం లాగే ఉంటుంది. కాకపోతే దీని పరిణామం బోయింగ్ 737 కంటే ఎక్కువ. బరువు 50 టన్నులు ఉంటుంది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (CASIC) సంస్థ ఈ బుల్లెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కి శ్రీకారం చుట్టింది. దీనికి టెంగ్యున్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. 2016 నుంచి దీనిపై కసరత్తులు జరుగుతున్నాయి.
ఈ బుల్లెట్ విమానం టేకాఫ్ అవ్వాలంటే కొన్ని లక్షల లీటర్ల చమురు కావాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అన్ని విధాలుగా క్షేమంగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా ఈ బుల్లెట్ విమానాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ బుల్లెట్ విమానం సక్సెస్ అయితే దీనికి వాడిన టెక్నాలజీతో మరింత వేగంతో ప్రయాణించే రైళ్లను తయారుచేసే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విమానం ప్రయాణించేందుకు ఇప్పటికే 1.2 కిలోమీటర్ల పొడవైన మాగ్లెవ్ ట్రాక్‌ను శాస్త్రవేత్తలు తయారుచేసారు. టెస్టింగ్ బాగుంటే ఇంకా పరిణామాన్ని పెంచుతారు. అయితే చైనాకు ఇలాంటి ప్రయోగాలు కొత్తేం కాదు. కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలోనే చైనా ఇలాంటి ప్రాజెక్ట్‌ను చేపట్టాలని అనుకుంది. (Bullet Train To Moon)
1990ల్లో నాసా ఈ ప్రాజెక్ట్‌ను కార్యరూపం దాల్చాలని అనుకుంది. కానీ అప్పట్లో బడ్జెట్ లేకపోవడం సాంకేతిక సమస్యల వల్ల విరమించుకుంది. అయితే ఇప్పుడు జపాన్ కేవలం ఆలోచనల వద్దే ఆగిపోకుండా భూమి, ఆకాశం, మార్స్ గ్రహానికి మధ్యలో ఇంటర్స్టెల్లార్ రైళ్లు ఉంటే బాగుంటుందని ప్లాన్ వేసింది. ఇందుకోసం కాజిమా కన్స్ట్రక్షన్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ రైళ్లు వచ్చేసరికి 2050 అవుతుంది. ఇక ఫైనల్ వెర్షన్ రావాలంటే మరో వందేళ్లు పడుతుంది. ఈ బుల్లెట్ రైలు చూడటానికి గాజుతో తయారుచేయబడి కోన్ ఆకారంలో ఉంటుంది. ఈ బుల్లెట్ రైలు మార్స్‌లో ఉంటే మార్స్ గ్లాస్, భూమిపై ఉంటే లూనా గ్లాస్‌గా పిలవబడుతుంది.