Kavitha కు ఈడీ వేసిన ప్రశ్నలు ఇవే
ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi liquor Case) భాగంగా భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kavitha) ఈడీ అధికారులు మొన్న శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఈడీ కవితను దాదాపు 10 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా ఈడీ కవితకు కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు ఏంటంటే..
ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీలో టెండర్ల కోసం ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి
లిక్కర్ స్కాంతో వచ్చిన రూ.192 కోట్లను ఏం చేసారు?
సౌత్ గ్రూప్‌తో మీకేం సంబంధం?
ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారా?
రామచంద్ర పిళ్లైకి కోటి రూపాయలు ఎందుకు ఇప్పించారు?
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియాలతో చర్చలు జరిపారా?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పాత్ర ఏంటి?
ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసారు?
చాట్స్ ఎందుకు డిలీట్ చేసారు?
దాదాపు ఏడుగురు సభ్యుల ఈడీ బృందం కవితను విచారిస్తున్నారు. ఏం అడిగినా కూడా తనకు అసలు ఈ కేసుతో సంబంధం లేదని.. తనకు సంబంధం లేని కేసులో ఇరికించి ప్రశ్నలు వేస్తే ఎలా సమాధానాలు చెప్తానని అంటున్నారు. కవితకు బీపీ ఎక్కువ లేదా తక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందున విచారణ చేస్తున్న గది వద్దే వైద్యులను ఉంచారు. కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా ఈ కేసు విచారణ త్వరగా అయిపోతుందని అప్పుడు కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు కవితతో చెప్తున్నారు. (Kavitha)