Shloka Mehta: అంబానీ పెద్ద కోడలు..అత్యంత ఖరీదైన వస్తువులు
Shloka Mehta: రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కోడలు శ్లోకా మెహతా వద్ద అత్యంత ఖరీదైన వస్తువులు ఉన్నాయట. రోజీ డైమండ్స్ ఛైర్మన్ రస్సెల్ మెహతా, మోనా మెహతాల కుమార్తె అయిన శ్లోకా.. అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మొన్న గుజరాత్‌లోని జామ్ నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చెంట్‌ల (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో శ్లోకా వేసుకున్న గౌను టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎందుకంటే ఆ గౌను ధర రూ.13 లక్షల 24 వేలు.
డ్రెస్ మాత్రమే కాదు.. ఆమె చేతిలో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ అయిన హర్మే హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. దీని విలువ రూ.57,99,965. ఈ వేడుకకు శ్లోకా వేసుకున్న వాచీని చూసి చాలా మంది సెలబ్రిటీలు నోరెళ్లబెట్టారు. ఎమిరాల్డ్ పొదిగిన ప్యారెట్ మోటిఫ్ కార్టియర్ బ్రాండ్‌కి చెందిన ఈ వాచీ ధర రూ,93,60,00. ఇలాంటివి శ్లోకా వద్ద చాలానే అత్యంత ఖరీదైన వస్తువులు ఉన్నాయి.