Game Changer: లీకైన పిక్‌.. వైర‌ల్ అవుతున్న కియారా లుక్

Game Changer: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు షాక్ త‌గిలింది. శంక‌ర్ (Shankar) ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలోని కియారా లుక్ ఒక‌టి షూటింగ్ సెట్స్ నుంచి లీక్ అయ్యింది. కియారా చీర క‌ట్టులో ఉన్న లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అస‌లే షూటింగ్ స‌మ‌యానికి పూర్తి కాక.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలీక టీం స‌త‌మ‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇలా షూటింగ్ పిక్ బ‌య‌టికి రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ALSO READ: Game Changer: ఆ ప‌ని చేయ‌ని ఏకైక టాలీవుడ్ సినిమా ఇదే..!

ALSO READ: Game Changer: ఇండియ‌న్ 2కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారా?