Vijay Mallya: RCB అబ్బాయిలు కూడా గెలిచేస్తే…

Vijay Mallya: ఈసాల క‌ప్ న‌మ‌దే (ఈ ఏడాది క‌ప్పు మ‌న‌దే).. ప్ర‌తి ఇండ‌య‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) స‌మ‌యంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) టీం అనుకునే మాట ఇది. IPL చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టైటిల్ గెలిచింది లేదు. దాంతో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సార‌థి విరాట్ కోహ్లి (Virat Kohli) ఐపీఎల్ స‌మ‌యంలో ఎన్నో సెటైర్లు, కామెంట్స్ ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇప్పుడు విరాట్ కోహ్లీపై మ‌రింత ఒత్తిడి ఉండే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో (Women’s Premiere League) రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క‌ప్పు గెలిచేసింది. WPL 2024 విన్నర్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరే. ఈ టీంకు సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స్మృతి మంథాన (Smriti Mandhana) ఎట్ట‌కేల‌కు RCBకి ఓ IPL క‌ప్పు ఉండాల‌న్న క‌ల‌ను నెర‌వేర్చింది.

దీనిపై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ య‌జ‌మాని విజ‌య్ మాల్యా స్పందించారు. అమ్మాయిలు గెలిచేసారు ఇక అబ్బాయిల టీం కూడా గెలిచేస్తే బాగుంటుంది అంటూ త్వ‌ర‌లో జ‌ర‌గబోయే IPL 2024 మ్యాచ్‌ల‌కు విషెస్ తెలిపారు. టైటిల్ గెలిచిన అనంత‌రం స్మృతి మంథాన మాట్లాడుతూ.. ఈ సారి మ్యాచ్‌లు త‌న‌కు ఎన్నో పాఠాల‌ను నేర్పించాయ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత స్మృతి మంథాన టీం సెల‌బ్రేష‌న్స్‌లో విరాట్ కోహ్లీ కూడా పాల్గొని టీంకు విషెస్ తెలిపారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 16 ఏళ్ల చ‌రిత్ర‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఒక్క‌సారి కూడా టైటిల్ గెల‌వ‌లేదు. ఈ ఏడాది స్మృతి మంథాన గెలిపించింది కాబ‌ట్టి ఇక విరాట్ కోహ్లీకి కూడా ఈ ఏడాది క‌లిసొస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశ‌ప‌డుతున్నారు.