Mahasena Rajesh: చంద్ర‌బాబు గారూ.. ఈ టార్చర్ ఏంటండి నాకు?

Mahasena Rajesh: తెలుగు దేశం పార్టీ త‌ర‌ఫున పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు మ‌హాసేన రాజేశ్. అయితే ఆయ‌న్ను ఇప్పుడు జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అవ‌మానిస్తున్నార‌ట. త‌న‌ను చంద్ర‌బాబు నాయుడు పి.గ‌న్న‌వ‌రం తెలుగు దేశం పార్టీ ఇన్‌ఛార్జిగా నియ‌మించార‌ని.. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నుంచి పి.గ‌న్న‌వ‌రానికి IVRS వ‌స్తున్నాయ‌ని రాజేశ్ తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తుంటే త‌న‌ను జ‌న‌సేన అవ‌మానిస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌ని బాధ‌ప‌డ్డారు.

“” ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసే వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌న్ను తెలుగు దేశం త‌ర‌ఫు నుంచి పి.గ‌న్న‌వ‌రం టికెట్ ఇచ్చి పోటీ చేయ‌మ‌న్నారు. కానీ పి.గ‌న్న‌వ‌రం నుంచి జ‌న‌సేన నేత‌లే పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పి.గ‌న్న‌వరంలో IVRS కాల్స్ వెళ్తున్నాయి. చంద్ర‌బాబు నాయుడు న‌న్ను పిలిచి.. ఒరేయ్ రాజేశ్ నువ్వు పోటీ నుంచి త‌ప్పుకో.. నీకు వేరే అవ‌కాశం ఇస్తాను. నువ్వెప్పుడూ ప‌ద‌వి కావాల‌ని అడ‌గ‌లేదు క‌దా అని పిలిచి చెప్పేవ‌ర‌కు ఓపిక పట్టండి. నాకు టికెట్ ప్ర‌క‌టించ‌నంత వ‌ర‌కు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు ఈ టార్చ‌ర్ ఏంటి చంద్ర‌బాబు గారూ..! నన్ను జ‌న‌సేన అవ‌మానిస్తున్న‌ట్లే అనిపిస్తోంది “” అంటూ బాధ‌ప‌డ్డారు.