TDP BJP Janasena: జగన్ని మోదీ ఎందుకు తిట్టలేదు..?
TDP BJP Janasena: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా (AP Elections) మోగిన నేపథ్యంలో ఆదివారం ప్రజాగళం పేరిట భారీ యాత్రను నిర్వహించాయి భారతీయ జనతా, తెలుగు దేశం, జనసేన పార్టీలు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరై మరింత ఉత్సాహాన్ని పెంపొందించేలా చేసారు. అయితే నిన్న జరిగిన ప్రజాగళం అంశంపై కొందరు జనసేన (Janasena), తెలుగు దేశం (Telugu Desam), YSRCP సపోర్టర్లు మోదీ ఎందుకు ఏపీ ప్రజలకు హామీలను ప్రకటించలేదు అని ప్రశ్నిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదేనా పొత్తు ధర్మం అంటూ చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
నరేంద్ర మోదీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయన వరుసగా 13 ట్వీట్లు నిన్నటి సభ గురించి, ఆంధ్ర గురించి, జగన్ నీ సాగనంపండి అని వేశారు. ఆయన నిన్న జన ప్రభంజనం చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. కొంత మంది తెలుగుదేశం అభిమానులు , YSRCP వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు. (TDP BJP Janasena)
రాష్ట్రానికి వరాలు ఇవ్వలేదు మోదీ
టిడిపి జనసేన కూడా వాళ్ళ మానిఫెస్టో / వరాలు చెప్పలేదు కదా నిన్న. మోడి ఒక్కడినే అనడం ఎందుకు? ఇంకా 40-50 రోజులు సమయం ఉంది
జగన్ని మోదీ ఎందుకు తిట్టలేదు?
మోడీ ఏమైనా తెలుగుదేశం/ జనసేన అధికార ప్రతినిధి పట్టాభి / పోతిన మహేషా ఇష్టం వచ్చినట్టు జగన్ ను తిట్టడానికి ? మోడీ స్థాయి కి జగన్ నీ తిట్టడం జగన్ స్థాయి ని పెంచినట్టు అవుతుంది. అత్యంత అవినీతి ఆంధ్ర ప్రభుత్వాన్ని సాగనంపండి అని స్పష్టంగా చెప్పారు
తెలుగు దేశం పేరు ఎందుకు చెప్పలేదు?
భారతీయ జనతా పార్టీ పేరు కూడా చెప్పలేదు. NDA కాబట్టి NDA పేరునే మోదీ వాడారు. రెండు సార్లు తెలుగు దేశం పార్టీ, జనసేన అని ట్వీట్ చేశారు
మోదీని చంద్రబాబు ఎందుకు అంతగా పొగిడారు?
గతంలో తిట్టిన తిట్లకి రీయూనియన్ కూడా మరి అంత క్లిష్టంగానే ఉంటుంది. చంద్రబాబు తనదైన శైలిలో కవర్ చేసుకోవాల్సి వచ్చింది.