Mangli: జ‌స్ట్ మిస్.. తృటిలో త‌ప్పించుకున్న మంగ్లీ

Mangli: ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లికి తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద సింగర్ మంగ్లీ కారును క‌ర్ణాట‌క‌కు చెందిన డీసీఎం ఢీకొట్టింది. మంగ్లీతో పాటు కారులో ఉన్న‌ మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు మంగ్లి వారితో క‌లిసి కారులో బ‌య‌లుదేరారు. కార్య‌క్ర‌మం పూర్త‌య్యేసరికి చీక‌టి ప‌డింది. ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.