Baahubali 3 పై ప్ర‌భాస్ ఏమ‌న్నారు?

Baahubali 3: ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) తెర‌కెక్కించిన అద్భుత దృశ్య‌కావ్యం బాహుబ‌లి. ఇప్ప‌టికీ టాలీవుడ్ రికార్డుల గురించి మాట్లాడాలంటే బాహుబిలికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత అని చెప్తారు. ఇప్ప‌టికే బాహుబ‌లికి రెండు భాగాలు వ‌చ్చాయి. మ‌రి బాహుబ‌లి 3 అనేది ఉందా? అస‌లు వ‌స్తుందా రాదా? అనే అంశంపై స్పందించారు రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas)

త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌మౌళి 6 స్క్రిప్ట్స్ ఇచ్చార‌ని బాహుబ‌లి పార్ట్ 3 తీయ‌బోతుంటే రాజ‌మౌళి ఎంతో ఆతృత‌తో ఉంటార‌ని అన్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌కు 6 స్క్రిప్టులు మాత్ర‌మే ఇచ్చార‌ని త‌న‌కు తెలిసి ఇంకో 14 వ‌ర‌కు స్క్రిప్టుల‌ను జ‌క్క‌న్న సిద్ధం చేసే ఉంటార‌ని తెలిపారు. స్క్రిప్ట్ విష‌యంలో 60% వ‌ర్క్ పూర్తి అయిపోయింద‌ని చెప్పారు. రాజ‌మౌళి మైండ్‌లో ఐదేళ్ల నుంచి ఓ స్క్రిప్ట్ ఉంద‌ని.. కానీ అది బాహుబ‌లి 3కి సంబంధించిందా కాదా అనేది మాత్రం త‌న‌కు క్లారిటీ లేద‌ని వెల్ల‌డించారు.

ఇకపోతే ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమా షూటింగ్‌ను ఇటీవ‌ల ఇట‌లీలో పూర్తి చేసుకుని హైద‌రాబాద్ చేరుకున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెర‌కెక్కించిన ఈ సినిమా మే9న అనుకున్న స‌మ‌యానికే రిలీజ్ కానుంది.