Viral News: 60% భారతీయుల చూపు అక్రమ సంబంధాల వైపు!
Viral News: మీరు చదివింది నిజమే. భారతదేశంలో 60 శాతం మంది అక్రమ సంబంధాలకే మొగ్గు చూపుతున్నారట. ఈ విషయాన్ని గ్లీడెన్ అనే డేటింగ్ యాప్ ద్వారా వెల్లడైంది. గ్లీడెన్ సంస్థ పెళ్లైన వారిపై.. రిలేషన్షిప్లో ఉన్నవారిపై.. సింగిల్‌గా ఉన్నవారిపై ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో 25 నుంచి 50 ఏళ్ల వయసు వారు పాల్గొన్నారు. వీరిలో దాదాపు 1,503 మంది పెళ్లైన వారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మొగ్గు చూపినట్లు తేలింది. వీరంతా కూడా టియర్ 1 టియర్ 2 నగరాలకు చెందినవారిగా గుర్తించింది.
ఇక రిలేషన్షిప్లో ఉన్నవారు తమ పార్ట్నర్స్కి తెలీకుండా ఇతరులతో శృంగారం చేస్తున్నారని కూడా తేలింది. మన భారత సంప్రదాయంలో ప్రేమ, పెళ్లి అనే బంధాలకు ఎంతో విలువ ఇస్తాం. అలాంటిది ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాలు, విలువలు కూడా మారిపోతున్నాయనే చెప్పాలి. ఈ సర్వేలో తేలిన మరో షాకింగ్ విషయం ఏంటంటే.. దాదాపు 46% మంది మగవారు కలకత్తాకు చెందినవారే అట. ఇక్కడ వేరొకరితో సంబంధం పెట్టుకుంటున్నారు అంటే అది కేవలం శారీరక సంబంధం అనడానికి లేదు. తమ పార్ట్నర్స్ దగ్గర ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే కూడా ఇతరులకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.
అంతేకాదు సర్వేలో పాల్గొన్న వారిలో 36% అమ్మాయిలు, 36 శాతం అబ్బాయిలు ఆన్లైన్లో ఫ్లర్ట్ చేసుకోవడాన్ని ఇష్టపడతారట. ఇలాంటివారు ఎక్కువగా కొచ్చి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. దాదాపు 35 శాతం మందిలో తాము రిలేషన్షిప్లో ఉన్నవారు కాకుండా వేరొకరిని కలలో ఊహించుకుంటున్నవారు కూడా ఉన్నారట. ఇలాంటివారిలో ఎక్కువగా జైపూర్, లుధియానాకు చెందినవారు ఉన్నారు. సో.. అమ్మాయిలూ.. అబ్బాయిలూ.. మిమ్మల్ని నిజాయతీగా ప్రేమిస్తున్నవారిని మోసం చేయడాలు వంటివి చేయకండి. ఎందుకంటే ఈరోజుల్లో నిజమైన ప్రేమ దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి. ఏమంటారు..!