Samantha: “ఊ అంటావా”.. ఇంకెప్పుడూ అన‌ను!

Samantha: పుష్ప (Pushpa) సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా పాట‌లో అల్లు అర్జున్‌తో క‌లిసి ఆడి పాడింది స‌మంత. ఈ పాట రిలీజ్ అవ్వ‌గానే చార్ట్ బ‌స్ట‌ర్ అయిపోయింది. హిందీలో కూడా తెగ మార్మోగిపోయింది. విడాకుల త‌ర్వాతే స‌మంత ఈ ఐటెం పాట‌లో న‌టించింది. అయితే ఇంకెప్పుడూ ఇలాంటి ఐటెం పాట‌ల్లో అస్స‌లు న‌టించ‌న‌ని తేల్చి చెప్పేసింది సామ్.

ఈ పాట‌లో న‌టిస్తున్న‌ప్పుడు తాను చాలా అసౌక‌ర్యానికి గురయ్యాన‌ని తెలిపారు. ఈ పాట‌లో డ్యాన్స్ చేస్తున్నంత సేపు కాళ్లు వ‌ణికిపోయాన‌ని అన్నారు. “” నేనెప్పుడూ కూడా నేను బాగోను.. అందంగా ఉండ‌ను.. అంద‌రి అమ్మాయిల్లా ఉండ‌ను అనుకుంటూనే ఉండేదాన్ని. అలాంటి నాకు ఊ అంటావా పాట‌లో న‌టించ‌డం చాలా క‌ఠిన‌మైన నిర్ణ‌యం. ఇలాంటి క‌ఠిన‌త‌ర‌మైన పాట‌లు, క్యారెక్టర్స్‌లో న‌టించాల‌నే న‌న్ను నేను న‌టిగా మార్చుకుంటూ వ‌చ్చాను. నేను ఊ అంటావా పాట‌ను ఒప్పుకున్న‌దే ఆ పాట‌లోని లిరిక్స్ నచ్చి. ఆడ‌వాళ్లంటే కేవ‌లం అందంగా క‌నిపించ‌డానికే కాదు.. వారి అందాన్ని బ‌ట్టే వారికి విలువ క‌డుతున్నారు అది చాలా త‌ప్పు అని చెప్ప‌డానికి ఆ పాట‌లో న‌టించాను. అయితే ఇలాంటి పాట‌ల్లో నేను ఇక జీవితంలో న‌టించ‌ను “” అని తెలిపారు.