Kalvakuntla Kavitha: క‌విత‌కు బ‌ల‌వంతంగా ఇంజెక్ష‌న్.. లాయ‌ర్ షాకింగ్ కామెంట్

Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scam) భార‌త రాష్ట్ర స‌మితి (BRS) క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను నిన్న రాత్రి ఈడీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాత్రికి రాత్రే ఆమెను ఢిల్లీకి త‌ర‌లించారు. అయితే ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి త‌ర‌లించిన త‌ర్వాత అధికారులు క‌విత‌కు బ‌ల‌వంతంగా ఏదో ఇంజెక్ష‌న్ ఇచ్చిన‌ట్లు క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది విక్ర‌మ్ చౌదరి కోర్టులో వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు ఆమెకు ఇంజెక్ష‌న్ ఇచ్చిన‌ట్లు విక్ర‌మ్ చౌద‌రి ఆరోపిస్తున్నారు.

క‌విత ఆరోగ్య ప‌రిస్థితిపై లాయ‌ర్ న్యాయ‌మూర్తికి వివ‌ర‌ణ ఇచ్చారు. క‌విత‌ను 10 రోజులు ఈడీ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని న్యాయ‌స్థానంలో కోర‌గా.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఢిల్లీ కోర్టు రిజ‌ర్వ్‌లో ఉంచింది. అయితే క‌విత‌కు ఇంజెక్ష‌న్ గురించి లాయ‌ర్ విక్ర‌మ్ చౌద‌రి కోర్టులో ప్ర‌స్తావించ‌గా.. క‌విత‌కు ఉన్న‌ట్టుండి బీపీ ప‌డిపోయింద‌ని అందుకే ఇంజెక్ష‌న్ ఇచ్చామ‌ని చెప్పార‌ట‌. దీనిపై విక్ర‌మ్ స్పందిస్తూ.. క‌విత‌కు బీపీ ఎక్కువ‌గా ఉంద‌ని.. ఆమెకు గుండె కొట్టుకునే తీరు స‌రిగ్గా లేద‌ని విక్రమ్ చౌద‌రి తెలిపారు.