Chandrababu Naidu: ఆపరేషన్ చీపురుపల్లి.. బాబు ప్లానేంటి?
Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చీపురుపల్లి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చీపురుపల్లిలో YSRCP నుంచి బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) అధికారంలో ఉన్నారు. చీపురుపల్లిలో తెలుగు దేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారు.
ఆల్రెడీ అక్కడ కిమిడి నాగార్జున పనిచేస్తున్నారు. 2014లో తెలుగు దేశం పార్టీ నుంచి కిమిడి మృణాళిని గెలిచారు. అప్పట్లో మంత్రిగానూ పనిచేసారు. కానీ పార్టీ పటిష్ఠతకు ఆమె సరిగ్గా పనిచేయలేదన్న అభిప్రాయం ఉంది. పైగా చీపురుపల్లికి మృణాళిని నాన్ లోకల్. గత ఐదేళ్లుగా కిమిడి నాగార్జునను తిరుగుతున్నా బొత్సను ఓడించేంత ఊపు రాలేదని తెలుగు దేశం పార్టీ అభిప్రాపడుతోంది. ఈ నేపథ్యంలో బొత్సను ఢీకొట్టాలంటే..అధికంగా బలంగా ఉన్న గంటా శ్రీనివాస్ రావు (Ganta Srinivas Rao) సరైన వ్యక్తి అని భావిస్తోంది.
ALSO READ: బాబు తీరు బాగోలేదు..!
ఇప్పటికిప్పుడు నాన్ లోకల్ అయిన గంటా శ్రీనివాస్ రావు చీపురుపల్లికి టికెట్ ఇస్తే ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన నాగార్జున వర్గం సహకరిస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆ మధ్య మీసాల గీత పేరు కూడా వినిపించింది. కానీ సర్వేలు గట్టిగా చేయించిన తెలుగు దేశం పార్టీ గంటా శ్రీనివాస్‌రావు మాత్రమే సరైన వ్యక్తి అని తేల్చింది. పైగా ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాస్ రావు పేరంటే తెలీని వారు లేరు. (Chandrababu Naidu)
మూడు జిల్లాల్లోనూ గంటాకు పేరుంది. అందులోనూ చీపురుపల్లిలో నాయకత్వ లోపం తప్ప కేడర్ బలంగానే ఉందని తెలుగు దేశం పార్టీ. అందుకే 2014లో ఎన్నికలకు 18 రోజుల ముందు కిమిడి మృణాళినికి టికెట్ ఇచ్చినా గెలవగలిగారు. కాకపోతే కిమిడి నాగార్జున స్థానికుల మద్దతు కూడగట్టడంలో వెనకబడుతున్నారన్న అభిప్రాయంలో తెలుగు దేశం పార్టీ ఉంది. YSRCP వ్యూహాలకు చెక్ పెట్టలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. గంటాను చీపురుపల్లికి పంపిస్తే ఆయన సమర్ధంగా పనిచేయగలడు అని అందరి మద్దతు కూడగట్టగలరని నమ్ముతోంది. ఇన్ని పరిశీలించాకే గంటాన చీపురుపల్లికి పంపించాలనుకుంటోంది తెలుగు దేశం పార్టీ.