Ram Gopal Varma: పిఠాపురం నుంచి పోటీ చేస్తా

Ram Gopal Varma: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. తాను కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని పిఠాపురం నుంచి పోటీ చేస్తానని అన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికే వ‌ర్మ ఇలా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే తాను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాకుండా పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంత‌కీ ఆయ‌న‌కు టికెట్ ఏ పార్టీ ఇచ్చిందో మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే వైసీపీ వారు ఇచ్చి ఉండాలి.. లేదా ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తుండాలి.