ECI: YSRCPకి ఎన్నికల సంఘం షాక్
ECI: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికార YSRCP పార్టీకి షాకిచ్చింది. ఎన్నికల్లో YSRCP వాలంటీర్లను ఉపయోగించాలనుకుంది. అసలు వాలంటీర్లు ఎన్నికల సమయంలో చుట్టుపక్కల కూడా కనిపించకూడదని ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. వాలంటీర్లను ఎలాంటి ఎన్నికల విధులకు వినియోగించకూడదని స్పష్టం చేసింది.
ఆల్రెడీ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు వాలంటీర్లను పిలిపించి ఎన్నికల సమయంలో ఎప్పుడు పిలిచినా రావాలని పక్కనే ఉండి అన్నీ చూసుకునేలా ఉండాలని చెప్తున్నారట. ఈ విషయం ముందే గ్రహించిన తెలుగు దేశం, జనసేన పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా కాలం క్రితమే ఫిర్యాదు చేసాయి. ఎన్నికలు సాఫీగా జరగాలన్న ఉద్దేశంతోనే వాలంటీర్లను వినియోగించొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: Pawan Kalyan: అందుకే ఎవరు తిట్టినా నాకు సిగ్గు అనిపించదు
ALSO READ: Janasena: వైసీపీ నుంచి వచ్చిన అతనికి పవన్ ఎందుకు సీటు ఇవ్వలేదు?