Harish Shankar: న‌డిరోడ్డుపై ఆగిపోయిన కారును తోసిన ద‌ర్శ‌కుడు

Harish Shankar: ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఓ వ్య‌క్తికి సాయం చేసి మంచి మ‌న‌సును చాటుకున్నాడు. న‌డిరోడ్డుపై ఓ కారు ఆగిపోవ‌డంతో కారు దిగి మ‌రో న‌లుగురి సాయంతో కారును ముందుకు తోసారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కొంద‌రు స్థానికులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.

ఇక సినిమా విష‌యానికొస్తే.. ఆయ‌న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో (Pawan Kalyan) ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad Bhagat Singh) తీస్తున్నారు. దాదాపు షూటింగ్ అయిపోవ‌చ్చింది. ఇంకొంచెం పార్ట్ మిగిలి ఉంది. ఆ షూటింగ్ కూడా ఎన్నిక‌ల త‌ర్వాత పూర్తైపోతుంది. మ‌రోప‌క్క ర‌వితేజ (Ravi Teja) తోనూ ఓ సినిమా తీయ‌డంలో బిజీగా ఉన్నారు హ‌రీష్ శంక‌ర్.