Vishwak Sen: ఎవ‌రో నన్ను తొక్కాల‌ని చూస్తున్నారు

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ న‌టించిన గామి (Gaami) సినిమా ఇటీవ‌ల రిలీజ్ అయ్యి మంచి టాక్ అందుకుంది. అయితే ఇండ‌స్ట్రీకి చెందిన‌వారు ఎవ‌రో త‌న‌ను త‌న సినిమాల‌ను తొక్కేయాలని చూస్తున్నార‌ని విశ్వ‌క్ సేన్ అంటున్నారు. సినిమాను చాలా మంది ఆద‌రిస్తున్నార‌ని కానీ బుక్ మై షోలో మంచి రేటింగ్స్ ఉన్నా కూడా బాట్ ద్వారా సినిమాకు 1 రేటింగ్ వ‌చ్చేలా చేస్తున్నార‌ని.. ఎన్ని రోజుల పాటు ఎన్ని సార్లు త‌న‌ను కింద‌కి లాగాలని చూసినా తాను ఎలాస్టిక్ లాగా అంత పైకి ఎదుగుతాన‌ని అన్నారు.

“”” డియ‌ర్ ఫ్రెండ్స్.. గామి సినిమాపై మీరు చూపించిన ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు. గామి సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు బుక్ మై షోలో మంచి రేటింగ్స్ ఉన్నాయి. కానీ ఆ త‌ర్వాత బాట్ ద్వారా రేటింగ్ తగ్గించాల‌ని చూస్తున్నారు. ఇలా ఎవ‌రు చేస్తున్నారో తెలీదు కానీ ఎవ‌రో న‌న్ను, నా సినిమాల‌ను కిందికి లాగాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. వారెవ‌రో నాకు తెలీదు. కానీ వారికి ఒక్క‌టే చెప్పాల‌నుకుంటున్నాను. న‌న్ను ఎంత లాగాల‌ని చూసినా నేను ఎలాస్టిక్ లాగా సాగిపోతూ ఎదుగుతాను. న‌న్ను అర్థంచేసుకుని నా వెన్నంటే ఉంటూ స‌పోర్ట్ చేస్తున్న వారికి రుణ ప‌డి ఉంటాను “”” అని తెలిపారు విశ్వక్.