Vijay Devarakonda: అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda: నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) విజయ్ దేవరకొండల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య లవ్ స్టోరీ నడుస్తోందని..త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇప్పటికే చాలా సార్లు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు నటీ,నటులు మాత్రం మా మధ్య ఏం లేదని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ నెటిజన్ల చేతికి చిక్కారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక రహస్యంగా ప్రేమలో ఉన్నారని గతంలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరూ ఎక్కడా తమ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకోలేదు. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడినప్పుడల్లా రష్మిక ముఖం వెలిగిపోతుంది. అయితే మేమిద్దరం స్నేహితులం అని రష్మిక చెప్పింది.
ఇద్దరు కూడా అప్పుడప్పుడు వెకేషన్ ట్రిప్స్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. వీరిద్దరూ ఒకే చోట విడివిడిగా దిగిన ఫోటోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. వీరిద్దరి డేటింగ్‌కు సంబంధించిన సాక్షాల కోసం నెటిజన్లు చాలాసార్లు వైరల్‌గా మారారు. రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండ ఇంటికి ప్రార్థనల కోసం వెళుతుంది. అంతే కాకుండా దేవరకొండ బంధువులు రష్మిక స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది.
మరోసారి వీరికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. రష్మిక , విజయ్ మరోసారి అడ్డంగా దొరికి పోయారంటూ వీరికి సంబంధించిన ఫొటోల ను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే..కొద్దిరోజుల కిందట విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అతను ఒక బేబీ పింక్ కలర్ లో ఉండే క్యాప్ను పెట్టుకొని కనిపించాడు. (Vijay Devarakonda)
ALSO READ: Family Star: అతిథి పాత్రలో రష్మిక?
ఇక రీసెంట్‌గా ఉమెన్స్ డే సందర్భంగా మన నేషనల్ క్రష్ కూడా తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టులో అది పింక్ క్యాప్ ధరించి కనిపించింది. దీంతో ఇద్దరు సేమ్ టు సేమ్ క్యాప్ పెట్టుకున్నారేంటబ్బా అన్న చర్చ మొదలైంది. వీరు ప్రేమలో లేమని చెబుతున్నారు కానీ వీరు లవ్‌లో ఉన్నారు.. పాపం ఇలా అడ్డంగా దొరికిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్‌తో మరోసారి వీరి లవ్ ట్రాక్ నెట్టింట చర్చనీయాంశమైంది.
కొన్ని రోజుల క్రితం రష్మిక ఫ్యాన్ పేజీలో రష్మిక మందన్న భర్తగా మారడానికి పురుషుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో అనే పోస్ట్ వైరల్ అయ్యింది. ఆమె నేషనల్ క్రష్… కాబట్టి ఆమె భర్త కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త వీడీ (విజయ్ దేవరకొండ)లా ఉండాలి. చాలా ధైర్యంగా ఉండాలంటూ పోస్ట్ లో రాశారు. ఆ పోస్టులో వీడీ విజయ్ దేవరకొండ. ఈ పోస్ట్‌పై రష్మిక మందన్న వ్యాఖ్యానించడంతో నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇది కచ్చితంగా నిజమే’ అని రష్మిక ఫ్యాన్స్ పోస్ట్‌లో పేర్కొంది.
రష్మిక-విజయ్ దేవరకొండ 2018 తెలుగు చిత్రం గీత గోవిందంలో కలిసి కనిపించారు. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్ షిప్ పుకార్లు మొదలయ్యాయి.