Airtel: ఆ రీచార్జ్‌లను తీసేసిన ఎయిర్టెల్.. ఎక్కువ చెల్లించాల్సిందే
Airtel: ప్రముఖ నెట్వర్క్ సంస్థ ఎయిర్టెల్ చాలా మంది వినియోగదారులు ఎక్కువగా వాడే రీచార్జ్ ప్లాన్స్‌ని తీసేసింది. రూ.118, రూ.289 ప్లాన్స్ ఇప్పుడు చాలా మంది ఎయిర్టెల్ వినియోగదారులు వాడుతున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్స్‌ని ఎయిర్టెల్ తీసేసింది. వాటి స్థానంలో వేరే ధరల ప్లాన్స్‌ని తీసుకొచ్చింది. విచిత్రం ఏంటంటే.. వేరే ప్లాన్స్ ధరలను పెంచి సేవలను మాత్రం పాత రీచార్జ్ ప్లాన్స్‌ని ఉన్నవే కొనసాగేలా చేసింది. రూ.118 రీచార్జ్ కాస్తా రూ.129 చేసింది. రూ. 289ని రూ.329గా మారింది. ఎక్కువ డబ్బు పెట్టి రీచార్జ్ చేసుకున్నంత మాత్రాన అధిక లాభాలు కలుగుతాయని కాదు.