Avinash Reddy: అరెస్ట్‌కు రంగం సిద్ధం..!?

Avinash Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు స‌ర్వం సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి సీబీఐ హైకోర్టులో అవినాష్ రెడ్డికి వ్య‌తిరేకంగా పిటిష‌న్ వేసారు. ప్ర‌స్తుతం బెయిల్‌పై బ‌య‌ట తిరుగుతున్న అవినాష్‌.. సాక్ష్యం మార్చి చెప్పాల‌ని ద‌స్త‌గిరిని కొంత‌కాలంగా వేధిస్తున్నాడు. అత‌ను విన‌క‌పోయే స‌రికి అత‌ని తండ్రిపై దాడి చేసారు. ఈ నేప‌థ్యంలో అవినాష్ రెడ్డి బ‌య‌ట ఉంటే త‌న‌కు ఎప్ప‌టికైనా డేంజ‌రే అని ఆయ‌న బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ హైకోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. వాదోప‌వాదాలు విన్న సీబీఐ హైకోర్టు.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బెయిల్ ర‌ద్దు అయిన‌ట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని త్వ‌ర‌లో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయిన‌ట్లు తెలుస్తోంది.