Avinash Reddy: ఏ క్షణమైనా అవినాష్ అరెస్ట్‌..?

Avinash Reddy: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హ‌త్య కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఏ క్ష‌ణానైనా అరెస్ట్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో పిటిష‌న్ వేసారు. త‌ప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ త‌న‌ను అవినాష్ రెడ్డి మ‌నుషులు బెదిరిస్తున్నార‌ని ద‌స్త‌గిరి పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. ఇందుకోసం ఎంత డ‌బ్బు కావాలంటే అంత ఇస్తాం అని తాను క‌డ‌ప జైల్లో ఉన్న‌ప్పుడు తెగ వేధించార‌ని.. అవినాష్ రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేసి త‌న ప్రాణాల‌ను కాపాడాల‌ని ద‌స్తగిరి పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌పై విచారించేందుకు హైకోర్టు స్వీక‌రించింది.