Taapsee: ఆ హీరో హ‌గ్ ఇచ్చాడు.. అది చాలు నాకు

Taapsee: టాలీవుడ్‌లో త‌న యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సి ఇక్క‌డ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయింది. కానీ ఆమెకు బాలీవుడ్‌లో మంచి మార్కులు ప‌డ్డాయి. పైగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చి ప‌డుతుండ‌డంతో తాప్సి కెరీర్ మారిపోయింది. దాంతో ఇక ఆమె బాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయారు. తాప్సి కీ రోల్‌లో న‌టించిన డంకీ (Dunki) సినిమా ఇటీవ‌ల రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇందులో షారుక్ ఖాన్ (Shahrukh Khan) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

అయితే తాప్సి బ‌ర్త్‌డే రోజున షూటింగ్ స‌మ‌యంలో షారుక్ ఖాన్ త‌న‌కు హ‌గ్ ఇచ్చే సీన్‌లో న‌టించార‌ట‌. త‌న బ‌ర్త్‌డే రోజున షారుక్‌తో క‌లిసి అలాంటి హ‌గ్గింగ్ సీన్‌లో న‌టించ‌డానికి మించిన బెస్ట్ గిఫ్ట్ ఏముంటుంద‌ని తాప్సి తెలిపారు. “”” ఆరోజు నా బ‌ర్త్‌డే. డంకీ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవ‌చ్చింది. ఆరోజున నేను షారుక్ హ‌గ్ చేసుకునే సీన్‌లో న‌టించాం. నా బ‌ర్త్‌డే రోజున రొమాంటిక్ కింగ్ అయిన షారుక్‌తో క‌లిసి అలాంటి హ‌గ్ సీన్‌లో న‌టించ‌డానికి మించిన బెస్ట్ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. దాదాపు 48 ఫ్రేముల్లో నేను షారుక్‌ను హ‌గ్ చేసుకున్నాను. డంకీలో నా సీన్ రైలు ఫ్లోర్ క్లీన్ చేయ‌డంతో మొద‌లై.. షారుక్‌ను హ‌గ్ చేసుకోవ‌డంతో ముగుస్తుంది. ఇది నేను నా జీవితంలో మ‌ర్చిపోలేను “””” అని తెలిపారు తాప్సి