Viral News: డ‌బ్బుంది.. కానీ పేద‌వాడిగానే బ‌త‌కాల‌నుంది!

Viral News: ఈరోజుల్లో ఎంత కోటీశ్వ‌రులైనా కూడా ఇంకా ఇంకా సంపాదించాల‌నే అనుకుంటారు. అంతేకానీ డ‌బ్బులు ఉన్నాయి క‌దా అని రిలాక్స్ అయిపోరు. ఇక మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద ప్ర‌జ‌ల జీవితాల గురించి చెప్తే క‌న్నీళ్లాగ‌వు. అటు ఖ‌ర్చులు భ‌రించ‌లేక‌.. ఇటు డ‌బ్బు ఆదా చేసుకోలేక న‌ర‌కం అనుభ‌విస్తుంటారు. కానీ పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి మాత్రం అస‌లు ఈ డ‌బ్బు సంపాద‌న అనేది కేవ‌లం క‌ల్పితం మాత్ర‌మే అని అంటున్నాడు. పైగా త‌న ద‌గ్గ‌ర బోలెడు డ‌బ్బు ఉంది కానీ పేద‌వాడిగానే బ‌త‌కాల‌ని ఉంద‌ని చెప్తున్నాడు.

ఇత‌ని పేరు బెన్. 29 ఏళ్ల ఈ యువ‌కుడు న్యూయార్క్‌లో ఉంటాడు. బిట్‌కాయిన్ వంటివి నేర్చుకుని చిన్న వ‌య‌సులోనే కోట్లు సంపాదించాడు. ఇంత సంపాదించినా కూడా తన‌కు పేద‌వాడిలానే బ‌త‌కాల‌ని ఉంద‌ట‌. ఇత‌ను కేవ‌లం ఇంట్లో హైస్పీడ్ వైఫై, డైట్ కోక్, జిమ్ స‌భ్య‌త్వానికి మాత్ర‌మే ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తాడ‌ట‌. ఇక మిగ‌తావాటికి అస‌లు ఖ‌ర్చు పెట్ట‌డ‌ట‌. కోటీశ్వ‌రుల జీవితాలు ఆనందంగా ఉంటాయ‌నుకుంటారు కానీ అందులో ఏమాత్రం నిజం లేద‌ని.. త‌న‌కు కావాల్సిన దాని కంటే ఎక్కువ డ‌బ్బు సంపాదించుకున్నాక కంటి మీద కునుకే లేకుండాపోయింద‌ని బెన్ అంటున్నాడు.

“””” నా ద‌గ్గ‌ర బాగా డ‌బ్బు ఉంది. కానీ ఏం లాభం. నేను 99% ల్యాప్‌టాప్ ముందే ఉంటున్నాను. నా ఫ్రెండ్స్‌తో బ‌య‌టికి వెళ్దామంటే నా ఉద్యోగంపై ప్ర‌భావం ప‌డుతుంది. పైగా చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. కోటీశ్వ‌రుడిగా ఉండ‌టం కంటే పేద‌వాడిగా ఉంటేనే ఎంతో బెట‌ర్. పాష్ రెస్టారెంట్లు, బార్ల‌కు వెళ్లేవారు అస‌లు జీవితాన్ని ఏమాత్రం ఎంజాయ్ చేయ‌రు. కేవ‌లం త‌మ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్నాయ్ అని పోజ్ కొట్ట‌డానికి మాత్ర‌మే ఇలాంటి ఖ‌రీదైన ప్ర‌దేశాల‌కు వెళ్తుంటారు. అలాగ‌ని నేను నాలా అంద‌రూ ఉండాల‌ని చెప్ప‌డం లేదు. రోజూ 9 నుంచి మొద‌లు పెట్టి 5 గంట‌ల‌కు ముగించే ఉద్యోగాలు చేస్తూ వేరొక‌రిని సంప‌న్నుల‌ను చేయ‌డానికి మీరు మీ న‌డుం వంచి ప‌ని చేయ‌డం ఎందుకు? మీకు మీరే ఏద‌న్నా సొంతంగా ఆలోచించుకుని మంచి వ్యాపారం లాంటిది చేసుకోవ‌చ్చు. ఇది అంద‌రికీ కుదురుతుంద‌ని చెప్ప‌ను. కానీ ప్ర‌య‌త్నించి చూడండి “””” అంటున్నాడు బెన్