Siddham: సభలో గ్రీన్ మ్యాట్.. VFX?
Siddham: YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చివరి సిద్ధం సభ ఈరోజు జరగనుంది. సిద్ధం పేరుతో ఇప్పటికే ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టిన జగన్.. ఈరోజు జరగబోయే సభలో గ్రీన్ మ్యాట్, వీఎఫ్ఎక్స్ వాడటంపై చర్చ జరుగుతోంది. ఈ గ్రీన్ మ్యాట్స్ ద్వారా సభకు లక్షలాది మంది జనాలు వస్తున్నట్లు జగన్ గ్రాఫిక్స్, VFX డిజైన్లు చేయిస్తున్నారని తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సిద్ధం సభ మొదలైన 40 నిమిషాలకు టెలికాస్ట్ అవుతోందని.. లైవ్ కవరేజ్ ఇచ్చేందుకు మీడియా వర్గాలకు కూడా YSRCP సిబ్బంది రానివ్వడంలేదని అంటున్నారు. ఈ గ్యాప్లో గ్రీన్ మ్యాట్ ఆధారంగా జనాలు వచ్చినట్లుగా గ్రాఫిక్స్ క్రియేట్ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.