Raghu Rama: ఢిల్లీలో రఘు రామకు అవమానం?
Raghu Rama: మాజీ మంత్రి రఘు రామ కృష్ణంరాజుకు (Raghu Rama Krishnam Raju) ఢిల్లీలో అవమానం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీతో (Bharatiya Janata Party) పొత్తు గురించి చర్చించేందుకు తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు నాలుగు రోజులుగా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. ఈరోజు ఉదయమే పొత్తు విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గేటు బయటే రఘురామ?
అయితే.. YSRCPలో తనకు జరిగిన ద్రోహానికి కోపోద్రిక్తుడైన రఘు రామ కృష్ణంరాజు తెలుగు దేశం, జనసేన పార్టీలతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇతను నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే ఇప్పుడు తెలుగు దేశం పార్టీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తోంది కాబట్టి.. నరసాపురం టికెట్ భారతీయ జనతా పార్టీ నేతకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీని గురించి చర్చించేందుకు రఘు రామ కూడా ఢిల్లీ వెళ్లారట. కానీ అమిత్ షా రఘరామను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోపెట్టారని టాక్. తనను లోపలికి అనుమతించాలని రఘు రామ ఫోన్లు చేస్తున్నా కూడా ఒప్పుకోలేదని సమాచారం.
ALSO READ: