Sai Dharam Tej: పేరు మార్చుకున్న ధరమ్ తేజ్..!
Sai Dharam Tej: సుప్రీం స్టార్‌గా టాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ తన పేరులో స్వల్ప మార్పు చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ అనేది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు. అయితే ఈ పేరుకి దుర్గ అనే పదాన్ని యాడ్ చేసారు. అంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పేరు సాయి దుర్గా తేజ్. ఇలా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో కూడా సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ధరమ్ తేజ్‌కి ఎటూ తండ్రి ఇంటి పేరు ఉంటుంది. కానీ తల్లి పేరు అలా రాదు. తన తల్లి కూడా తనతో ఎప్పుడూ ఉండాలన్న ఉద్దేశంతోనే ఆమె పేరును తన పేరులో యాడ్ చేసుకున్నానని.. అంతేకానీ జ్యోతిష్యాలు, న్యూమరాలజీ ప్రకారం మార్చుకోవడాలు వంటివి చేయలేదని వెల్లడించారు.