Posani Krishna Murali: కాపుల‌ను సీఎం చేయ‌రా?

Posani Krishna Murali: జన‌సేన, తెలుగు దేశం పార్టీలు కాపుల‌ను ముఖ్య‌మంత్రుల్ని చేయ‌రా అని ప్ర‌శ్నించారు న‌టుడు, APSFTVTDC ఛైర్మ‌న్ పోసాని కృష్ణ ముర‌ళి. ముఖ్య‌మంత్రిగా కాపుల‌కు ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌డంలేద‌ని నిల‌దీసారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) కాపుల‌కు తీవ్ర ద్రోహం చేస్తున్నార‌ని విమర్శ‌లు గుప్పించారు.

“””” తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన పార్టీలు చేస్తున్న కుట్ర‌ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. మా కాపుల్లో ఐఏఎస్, ఐపీఎస్, డాక్ట‌ర్లు ఇలా చ‌దువుకున్న వారు చాలా మంది ఉన్నారు. నిజాయ‌తీ ప‌రులు ఉన్నారు. నా కోసం ప్రాణం ఇచ్చే నాయ‌కులు ఎంత మంది లేరు.. నీ జాతి కాదు.. నువ్వు చెయ్య‌ను అన్నావ్. మ‌రి మ‌రో కాపుకి సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌చ్చు క‌దా..? కాపు వ‌ర్గానికి చెందిన ఏ అమ్మాయిలు, అబ్బాయిలు నిజంగా కాపు వ‌ర్గం ప‌ట్ల గౌర‌వం ఉంటే చంద్ర‌బాబు నాయుడుకు ఓటు వెయ్య‌కండి. వంగ‌వీటి రంగాను చంపిన పార్టీకి ఓటు వెయ్య‌ద్దు.

ALSO READ: TDP BJP Alliance: BJP పోటీ చేసే స్థానాలివేనా?

ఎవ‌రైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లు న‌మ్మి మీరు ఒక్క ఓటు సైకిల్‌కి వేస్తే స్వ‌ర్గంలో ఉన్న రంగా ఆత్మ క్ష‌భిస్తుంది. మీరు ఆ ఓటు వెయ్యక‌పోవ‌డ‌మే రంగ‌కు ఇచ్చే గొప్ప నివాళి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాపుల కోసం ప్ర‌జ‌ల కోసం అండ‌గా ఉంటాడ‌నుకున్నా. కానీ కాపు వ‌ర్గానికి చెందిన వంగ‌వీటి రంగాను చంపిన వాడి పార్టీతోనే చేతులు క‌లిపితే ఇంకేమ‌నాలి? ఆనాడు రోడ్డు మీద‌కు వ‌చ్చి చంద్ర‌బాబు నాయుడుని నోటికొచ్చిన‌ట్లు తిట్టిన ప‌వ‌న్ ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు ప‌క్షాన చేరాడు. అదేమంటే ఏపీ ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబుతో చేతులు క‌లిపానే త‌ప్ప స్వ‌లాభం కోసం కాదు అంటాడు. (Posani Krishna Murali)

ఎందుకు అన్నా మ‌న‌కు ఈ పొత్తులు అని ప్ర‌శ్నించిన‌వారితో మీరు నాకు స‌ల‌హాలు ఇస్తే మీరంతా వైసీపీ కోవ‌ర్టులుగా భావిస్తాను అనేసాడు. ఎందుకంటే జ‌న‌సేన కాపు నేత‌ల‌కు కూడా తెలుసు. ప‌బ్లిక్‌గా రంగ‌ను న‌రికి చంపించింది చంద్ర‌బాబు నాయుడే అని. ఆ బాధ‌తో ప‌వ‌న్‌కు త‌మ ఆవేద‌నను వ్య‌క్తం చేస్తుంటే ప‌వ‌న్ మాత్రం మీరు వైసీపీ కోవ‌ర్టులు అని వారి మ‌న‌సులు గాయ‌ప‌రిచే విధంగా ప్ర‌వ‌ర్తించాడు.  పైగా చంద్ర‌బాబు నాయుడుకే ఓటెయ్యాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లను ఆదేశిస్తున్నాడు. క‌మ్మ వాడికే ఓటు వెయ్యాలి.. క‌మ్మ వాడే ముఖ్య‌మంత్రి అవ్వాలి అంటున్నాడు. మ‌రి మ‌న కాపులు ఏం కావాలి?“””” అని షాకింగ్ కామెంట్స్ చేసారు పోసాని