TDP BJP Alliance: BJP పోటీ చేసే స్థానాలివేనా?
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామం అయితే చోటుచేసుకుందనే చెప్పాలి. ఇవాళ ఢిల్లీలో ప్రకటన జరగబోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తెలుగు దేశం పార్టీ ఒప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి.. పోటీ చేసే స్థానాల్లో మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా గెలవాలన్న ఉద్దేశంతోనే తెలుగు దేశం పార్టీ దీనికి సంబంధించి కసరత్తు చేసింది. అనేక సర్వేలు, నేతల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు సీట్లకు సంబంధించిన విషయంపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగా ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ, జనసేన సీట్లకు సంబంధించిన విషయంపైన క్లారిటీ ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇవ్వబోతున్నారు? ఎన్ని స్థానాలు ఆశిస్తోంది? ఆ ప్రాంతాలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ ఏం చెప్తోంది? వీటికి సంబంధించి పెద్ద చర్చే ఢిల్లీలో జరుగుతోంది. (TDP BJP Alliance)
ALSO READ: Varla Ramaiah: చంద్రబాబు గెలవాలని వైసీపీ నేతలూ కోరుకుంటున్నారు
నిన్న రాత్రి సీట్ల సంఖ్యకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు అడిగింది. తెలుగు దేశం పార్టీ మాత్రం 4 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పిందట. అయితే 5 ఎంపీ స్థానాల వద్ద డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. జనసేనకు సంబంధించి ఆల్రెడీ 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు. బందర్, కాకినాడ, అనకాపల్లి జనసేకు దక్కాయి. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ.. భారతీయ జనతా పార్టీకి అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట దక్కేలా ఉన్నాయి. వీటితో హిందూపూర్, విజయవాడ, వైజాగ్, అనంతపురం స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ 6 స్థానాలు కావాలని కోరారు. ఈ 6 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైనల్ చేసినవి 5 మాత్రమే. అని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇంకాసేపట్లో మూడు పార్టీల అధినేతలు ఓ సామూహిక ప్రకటనను ఇంకాసేపట్లో విడుదల చేస్తారు.