Viral News: లైవ్‌లో రిపోర్ట‌ర్‌ను అక్క‌డ ట‌చ్ చేసిన రోబో..!

Viral News: మ‌హిళ‌ల‌కు మ‌గ‌వారి నుంచే ర‌క్ష‌ణ లేదు అనుకుంటుంటే.. ఇప్పుడు రోబోల నుంచి కూడా ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న ఓ మ‌హిళా రిపోర్ట‌ర్‌ను ఓ రోబో తాక‌కూడ‌ని చోట ట‌చ్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఈ ఘ‌ట‌న సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. సౌదీ అరేబియా తొలి మ‌గ రోబోను డిజైన్ చేసింది. దీనికి రోబో మ‌హ్మ‌ద్ అని పేరు పెట్టింది. సౌదీ అరేబియా రాజ‌ధాని రియాధ్‌లో జ‌రిగిన డీప్ ఫెస్ట్ అనే కార్య‌క్ర‌మంలో ఈ రోబోను ప్ర‌వేశ‌పెట్టారు. రోబోను ఆవిష్క‌రిస్తున్న‌ప్పుడు ఓ మ‌హిళా రిపోర్ట‌ర్ లైవ్ ఇస్తుండ‌గా.. ఆ రోబో మ‌హిళ పిర్ర భాగాన్ని ప‌ట్టుకుంది. దాంతో ఆ మ‌హిళ కూడా షాకైంది. ఈ వీడియో బ‌య‌టికి రావ‌డంతో నెటిజ‌న్ల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి. మ‌గ‌ రోబోలు కూడా ఇలా ప్ర‌వ‌ర్తిస్తే ఎలా అని మండిప‌డుతున్నారు.