Ajith Kumar: హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన అజిత్
Ajith Kumar: ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. పూర్తి బాడీ చెకప్ కోసం ఓ రోజంతా ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఆయన విడాముయార్చి (VidaaMuyarchi) అనే సినిమాలో నటిస్తున్నారు. అజర్‌బైజాన్‌లో ఈ సినిమా షూటింగ్ కొంతకాలం పాటు జరిగింది. ఇటీవల అజిత్ షూటింగ్ ముగించుకుని ఇండియా చేరుకున్నారు. అజర్‌బైజాన్‌లో వాతావరణ మార్పుల వల్ల అజిత్‌కి స్వల్ప అస్వస్థత కలిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పూర్తి బాడీ చెకప్ కోసం హాస్పిటల్‌లో చేరినట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మార్చి 15 తర్వాత నుంచి సినిమా షూటింగ్ మళ్లీ కొనసాగనుంది.