Shivaratri: శివుడు ఎలా జన్మించాడు?

Shivaratri: ముల్లోకాల ఆది, అంతం చూడ‌గ‌లిగిన దైవం శివుడనే చెప్తుంటారు. శివ‌య్య ముందు ఇత‌ర శ‌క్తులు విఫ‌ల‌మ‌వుతాయి. అలాంటి శివ‌య్య పుట్టుక ఎలా జ‌రిగిందో తెలుసా? శివ‌య్య త‌ల్లిదండ్రులు, గురువు ఎవ‌రు?

శివ‌పురాణం ప్ర‌కారం శివుడిని స్వ‌యంభువుడు అంటారు. అంటే అత‌ని పుట్టుక స్వ‌యంగా జ‌రిగింది. త‌ల్లీతండ్రి లేరు. శివ‌య్య‌కు మ‌ర‌ణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువ‌డే కిర‌ణాల నుంచి శివుడి పుట్టుక జ‌రిగింది. అత‌ని నాభి నుంచి బ్ర‌హ్మ పుట్టాడు. ఒక‌సారి శివుడు త‌న కాళ్ల‌ను మ‌ర్ద‌న చేసుకుంటుండ‌గా.. ఆ మురికి నుంచి విష్ణువు జ‌న్మించాడ‌ట‌. అదే నిజం అయితే విష్ణు, శివ పురాణం వేరుగా ఉన్న‌ట్టే శివుడి జ‌న‌నం గురించి మ‌రో క‌థ ప్రాచుర్యంలో ఉంది.

బ్ర‌హ్మ‌, విష్ణు మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో మండుతున్న అగ్నిగోళంలా మ‌హాదేవుడు వారి మ‌ధ్య‌కు వ‌చ్చాడ‌ట‌. వారికి అలా ఎందుకు వ‌చ్చింద‌నే విష‌యం తెలీలేదు. అప్పుడే ఒక శ‌బ్ధం వ‌చ్చింది. ఎవ‌రైతే స్తంభానికి అంతం ఎక్క‌డుందో క‌నుక్కుంటారో.. వాళ్లే గొప్ప‌వారిగా గుర్తింపు తెచ్చుకుంటార‌ని చెప్తాడు. ఈ మాట విన‌గానే బ్ర‌హ్మ ఒక ప‌క్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి క‌నుక్కోవ‌డానికి బ‌య‌లుదేర‌తాడు. మ‌రోవైపు విష్ణువు వ‌రాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్క‌డుందో క‌నుక్కోవ‌డానికి బ‌య‌లుదేరాడు. చాలా సేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్క‌డుందో కనిపించ‌దు. (Shivaratri)

ALSO READ: Shivaratri: శివ‌రాత్రి రోజున ఇలా చేస్తే పాప రాశి దగ్ధమే..!

ఇద్ద‌రూ ఓట‌మిని అంగీక‌రించి వెన‌క్కి వ‌చ్చేస్తారు. ఆ త‌ర్వాత శివుడు త‌న అస‌లు రూపంలో వారిద్ద‌రికీ క‌నిపించాడు. దీంతో బ్ర‌హ్మ‌, విష్ణువులు ఇద్ద‌రూ శివుడే గొప్ప‌వార‌ని నిర్ధార‌ణ‌కు వ‌స్తారు. ఇంత‌కుమించిన శ‌క్తి ఎవ‌రి ద‌గ్గ‌ర లేదు. ఈ స్తంభం క‌థ శివుని జ‌న్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియ‌జేయ‌లేదు. అందుకే శివుడిని స్వ‌యంభు అంటారు. శివుడికి అంత‌మే లేద‌ని అంటారు. బ్ర‌హ్మ దేవుడు శివుడికి తండ్రా? ఈ క‌థ‌ను నిజం అనే న‌మ్మేవారు చాలా మంది ఉన్నారు. శివుడు బ్ర‌హ్మ దేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది.

భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోయిన‌ప్పుడు విష్ణువు మిన‌హా మ‌రో ప్రాణి ఈ లోకంలో జీవించి లేదు. అప్పుడు విష్ణువు ఒక్క‌డే త‌న శేష‌త‌ల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ త‌ర్వాత అత‌ని నాభి నుంచి బ్ర‌హ్మ జ‌న్మించాడు. విష్ణువు, బ్ర‌హ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో శివుడి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. బ్ర‌హ్మ దేవుడు అత‌న్ని గుర్తించ‌డానికి నిరాక‌రించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య‌దృష్టి ప్ర‌సాదించి బ్ర‌హ్మ దేవుడికి శివుడి గురించి గుర్తుచేసాడు. ఆ త‌ర్వాత బ్ర‌హ్మ త‌న త‌ప్పు తెలుసుకుని క్ష‌మాప‌ణ‌లు కోరాడు. త‌న త‌ప్పును స‌రిచేసుకోవ‌డానికి త‌న కుమారుడి రూపంలో పుట్టాల‌ని ఆశీర్వ‌దిస్తాడు. దీంతో శివుడు బ్ర‌హ్మ కోరిక మేర‌కు ఆయ‌న క‌డుపున పుడ‌తాన‌ని మాటిస్తాడు.

బ్ర‌హ్మ దేవుడు ఈ సృష్టి ర‌చ‌న చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవ‌స‌రం అయ్యాడు. అప్పుడే అత‌నికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది. బ్ర‌హ్మ దేవుడు ప్రార్ధించ‌గానే శివుడు అత‌ని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్ర‌త్య‌క్షం అవుతాడు. బ్ర‌హ్మ దేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు విన‌గానే ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి త‌న‌కు ఏ పేరూ లేద‌ని చెప్తాడు. అప్పుడు బ్ర‌హ్మ అత‌నికి రుద్ర అని పేరు పెడ‌తాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ త‌ర్వాత కూడా శివుడు ఏడుపు మాన‌లేదు. దీంతో బ్ర‌హ్మ వేరే పేరు పెడ‌తాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆప‌డు. శివుడు ఏడుపు ఆపేందుకు అత‌నికి 108 పేర్లు పెడ‌తాడు. అలా బ్ర‌హ్మ‌దేవుడు శివుడికి పెట్టిన 108 పేర్ల‌ను భూమిపై రాసిపెట్టిన‌ట్లు శివ పురాణం చెప్తోంది.