Atchannaidu: రాజధాని పేరుతో విశాఖలో జగన్ భూదోపిడీ
Atchannaidu: రాజధాని పేరుతో విశాఖలో జగన్ భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు. పరిశ్రమలు తరిమేసి యువతకు ఉద్యోగాలు దూరం చేశారని ఉక్కు నగరాన్ని తుక్కు నగరంగా మార్చిన చరిత్ర హీనుడని మండిపడ్డారు.
“””” వచ్చే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి పాలన సాగిస్తా.. మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..ఎప్పుడు జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొడదామా అని ఒక్క విశాఖ ప్రజలే కాదు ఎవత్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నిజంగా విశాఖ మీద అంత ప్రేమ ఉన్న జగన్ రెడ్డికి పరదాలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బటులు లేనిదే అడుగులు కూడా వేయలేని జగన్ రెడ్డి ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై ప్రేమ వెలగబోస్తున్నాడు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా విశాఖలో భూములు కొట్టేసేందుకే రాజధాని నాటకానికి తెరలేపిన జగన్ రెడ్డి ఐదేళ్ళుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. 5 ఏళ్లల్లో విశాఖలో రూ.40వేల కోట్ల భూదోపిడీకి జగన్ రెడ్డి అతని చెడ్డి గ్యాంగ్ పాల్పడ్డారు.
ఓట్ల కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కబ్జా చేసేందుకు, ఉక్కు కర్మాగారాన్ని అమ్మేందుకు సిద్ధపడిన మాట వాస్తవం కాదా జగన్ రెడ్డి! విశాఖను తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ధిక రాజధానిగా మార్చి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలతో తీర్చిదిద్దింది. విశాఖ సముద్ర తీరానా 13.59 ఎకరాలను లూలూ వంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకై నాడు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయిస్తే నేడు తన సొంత లాభానికై ఆ భూమిని కమర్షియల్ ప్లాజాకి అప్పగించారు. ప్రఖ్యాత కంపెనీలైన లూలూ, ఐబీఎం వంటి కంపెనీలను విశాఖ నుంచి తరిమేసి యువతకు ఉపాధి అవకాశాలను దూరం చేసిన కీచకుడు జగన్ రెడ్డి. ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టుల పూర్తి చేయడానికి ఇప్పటి వరకు జగన్ రెడ్డి చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన నీఛుడు జగన్ రెడ్డి. కేంద్ర పర్యావరణ శాఖ వద్దని చెప్పినా వినకుండా రుషికొండను ఆక్రమించి కొండకు గుండు కొట్టి ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు.
చంద్రబాబుగారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం నువ్వు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు జగన్ రెడ్డి. ఐటీలో రూ.1027.86 కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికై బాటలు వేస్తే నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల అక్రమార్జన చేయడం తప్ప అభివృద్ధి చేసింది సూన్యం. ఒక్క వైశాఖ ఐటీ సెక్టార్లోనే రూ.54,556 కోట్ల పెట్టుబడులతో 228 కంపెనీలను తెచ్చి 91,054 మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. కాని జగన్ రెడ్డి 5 ఏళ్లల్లో ఒక్క కంపెనీ ఒక్క పరిశ్రమలను తీసుకురాకపోగా.. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించకపోగా ఏం ముఖం పెట్టుకొని విశాఖలో తిరుగుతున్నావు జగన్ రెడ్డి! విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. (Atchannaidu)
అందరి ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి ప్రపంచ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. రైతుల నుంచి 34వేల ఎకరాలు సమీకరించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించడాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. కాని జగన్ రెడ్డి కక్షపూరితంగా ప్రజారాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల కలలను చెరిపేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్రపటం నుంచి రాజధానిగా అమరావతిని చెరిపేయటంతో పాటు 13 జిల్లాల అభివృద్ధిని చంపేశాడు.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయని ఎన్నికల ముందు చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హోదాపై పోరాడకుండా తన కేసుల మాఫీ కోసం హోదా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అవినీతి, అరాచక, విధ్వంసకర పాలన కారణంగా అసంఘటిత రంగంలో కోటిమంది కార్మికులు ఉపాథి కోల్పోయి రోడ్డునపడ్డారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి దాదాపు రూ. 17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడేశారు. విశాఖలోని రుషికొండ ఐటీ సెజ్‌లో నాడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన 14 కంపెనీలను జగన్ రెడ్డి తరిమేశాడు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సమస్యను పక్కదారి పట్టించేందుకు విశాఖను రాజధానిగా ప్రకటించి ప్రజలను మభ్యకు గురి చేసే కుట్రకు జగన్ రెడ్డి తెరలేపారు “””” అని వెల్లడించారు అచ్చెన్నాయుడు. (Atchannaidu)