Sunaina: తెలుగు హీరోయిన్ ఐస్‌బాత్.. ఫోటోలు వైరల్..!

Sunaina: హీరోయిన్‌గా రాణించాలంటే.. అందం, ఫిట్‌నెస్‌ చాలా చాలా ముఖ్యం. అందుకోసం వాళ్లు నిరంతరం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేయడం తప్పనిసరి. అందుకు కొత్త కొత్త యోగాలను కనిపెడుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్స్ ఐస్‌బాత్‌ చేస్తున్నారు. అయితే తెలుగు హీరోయిన్‌ సునైనా బిన్నంగా ఐస్‌ మెడిటేషన్‌ చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ముందుగా మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత నటిగా పరిశ్రమకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి సునైనా. తెలుగులో ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. హీరోయిన్‌గా మరో అవకాశం రాకపోవడంతో తమిళంకు వెళ్లారు. తమిళంలో కాదలిల్‌ విళిందేన్‌ చిత్రం ద్వారా నటుడు నకుల్‌కు జంటగా కథానాయకిగా పరిచయం అయిన సునైనా తొలి చిత్రం తోనే మంచి విజయాన్ని చవి చూశారు. ఈ చిత్రం 2008లో విడుదల అయ్యింది. ఆ తరువాత ఈ జంట మాచిలామణి అనే మరో చిత్రంలోనూ నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత వీరి కలిసి నటించలేదు. కాగా నటి సునైన మాత్రం నీర్‌ పరవై, వంశం వంటి పలు చిత్రాల్లో నటించినా స్టార్‌ డమ్‌ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఈమె చివరికా నటుడు విశాల్‌ సరసన లాఠీ చిత్రంతో పాటు రెజీనా అనే హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంలో నటించారు.

కొన్ని వెబ్‌ సిరీస్‌లోనూ నటించిన సునైనా ఇప్పుడు అరుదైన యోగాసనంతో వార్తల్లో కెక్కారు. ఫిట్‌నెస్‌లో భాగంగా ఈ భామ ఐస్‌ మెడిటేషన్‌ చేస్తుండడం విశేషం. సాధారణంగా ఒంటిలోని నరాలను బలపరచుకోవడం కోసం శరీర బడలికను తగ్గించుకోవడం కోసం ఐస్‌బాత్‌ చేస్తుంటారు. అలాంటిది నటి సునైన మాత్రం ఐస్‌ మెడిటేషన్‌ చేస్తున్నారు. ఒక టబ్‌లో ఐస్‌ ముక్కల నడుమ ఈమె యోగా చేశారు. దీంతో ఈమె మెడిటేషన్‌ చేస్తున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మెడిటేషన్‌ చూసాం కానీ.. ఈ మెడిటేషన్‌ ఎప్పుడు చూడలే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐస్‌బాత్‌ తో ప్రయోజనాలెన్నో..
కఠిన వ్యాయామాలు చేసినా, ఇంట్లో పనులు ఎక్కువైనా.. కండరాల నొప్పులు వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని నిమిషాల పాటు ఐస్‌బాత్‌ పద్ధతి పాటించడం వల్ల నొప్పులు దూరమై ప్రశాంతత లభిస్తుంది.

కొంతమంది అలసట, నీరసం, నిద్రలేమి.. వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఐస్‌బాత్‌ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మంచు నీటిలో కాసేపు సేదదీరడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఫలితంగా శరీరం చురుగ్గా మారడంతో పాటు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

వాతావరణం వేడిగా, తేమగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.. చెమట, జిడ్డుదనంతో చికాకు పుడుతుంది. అదే ఇలాంటి సమయంలో ఐస్‌బాత్‌ పద్ధతిని పాటిస్తే.. శరీర ఉష్ణోగ్రత తగ్గి.. ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇది రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

ఐస్‌బాత్‌ వల్ల మన శరీరంలో డోపమైన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది హ్యాపీ హార్మోన్‌. కాబట్టి మానసిక ఒత్తిళ్లను, ఆందోళనలను దూరం చేసి ప్రశాంతతను, సంతోషాన్ని అందిస్తుంది.

జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, గుండె పనితీరు.. ఇలా మన శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాల పనితీరును వేగస్‌ నాడి పర్యవేక్షిస్తుంది. ఐస్‌బాత్‌ చేయడం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఆయా జీవక్రియలన్నీ చక్కగా పూర్తవుతాయి.. కాబట్టి ఎలాంటి అనారోగ్యం, ఒత్తిడి ఉండవు.