Nizampet లో భ‌యాన‌క ఘ‌ట‌న‌..!

Nizampet: హైద‌రాబాద్‌లోని నిజాంపేట్‌లో భ‌యాన‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిజాంపేట‌లో నివ‌సిస్తున్న ఓ మ‌హిళ ఇంట్లోకి ఓ వ్య‌క్తి చొర‌బ‌డి తలుపు వేసేసాడ‌ట‌. దాంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆ మ‌హిళ వీడియో తీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా న‌న్ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ప్రాథేయ‌ప‌డ్డాడు. దాంతో ఆ మ‌హిళ వీడియో తీస్తూనే.. నువ్వు ముందు బ‌య‌టికి రా అంటూ అత‌న్ని బ‌య‌టికి పంపించేందుకు య‌త్నించ‌గా.. రెండో అంత‌స్తు నుంచి దూకి పారిపోయాడు.

దాంతో ఆ వీడియోను ఆ మ‌హిళ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఇంటి స‌మీపంలోని సీపీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంట్లో ఒంట‌రిగా ఉండే వృద్ధులు, మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ఇలాంటివి న‌గరంలో ఈ మ‌ధ్య‌కాలంలో చాలా జ‌రుగుతున్నాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.