Anant Radhika Wedding: మూడు రోజుల పెళ్లి.. ముచ్చటైన పెళ్లీ…!
Anant Radhika Wedding: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీల (Nita Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చెంట్ల (Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు గుజరాత్‌లోని జామ్ నగర్ వేదికగా మారింది. దాదాపు మూడు రోజుల పాటు వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి సంబంధించిన మరిన్ని అంశాలు మీకోసం.
స్నేహితులు.. ప్రేమికులుగా మారి
రాధిక, అనంత్లది పెద్దలు కుదిర్చిన వావాహం కాదు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. అలా వారి స్నేహం ప్రేమగా మారింది. చాలా మంది రాధిక ఎంతో అందంగా ఉంది.. అనంత్‌ని ఎలా ఇష్టపడింది అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అనంత్ చదువుకుంటున్న రోజుల్లో బాగానే ఉండేవాడు. కానీ అతనికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయాడు. తమ ఏడేళ్ల ప్రేమ జీవితంలో తన కుటుంబం తర్వాత రాధిక ఎంతో సపోర్ట్‌గా నిలిచిందని అనంత్ వెల్లడించాడు. 2018లో వీరి ప్రేమ వివాహం పబ్లిక్‌కి కూడా తెలిసింది. కానీ అప్పటికే రాధిక, అనంత్‌ల చదువు పూర్తి కాలేదు. దాంతో వారు చదువు పూర్తయ్యాకే వివాహం చేసుకోవాలని అనుకున్నారట. (Anant Radhika Wedding)
అన్న సేవతో మొదలై..
అంత డబ్బున్నవాళ్లయినా పెళ్లి వేడుకను మాత్రం అన్నసేవతో ప్రారంభించాలనుకున్నారు. అలా దాదాపు 50 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నసేవలో ముఖేష్, నీతా, రాధిక, అనంత్‌లు స్వయంగా భోజనాలు వడ్డించారు.
ఇక అనంత్ కంటే రాధిక ఒక సంవత్సరం పెద్దది. అనంత్ 1995లో పుట్టగా.. రాధిక 1994లో పుట్టింది. ఆన్కోర్ హెల్త్‌కేర్ సంస్థల సీఈఓ విరేన్ మర్చెంట్ కుమార్తే ఈ రాధిక మర్చెంట్. రాధికకు అంజలి అనే సోదరి కూడా ఉంది. ఇక అనంత్ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్లో డిగ్రీ చేపట్టాడు. కానీ అనంత్‌కు చదువుకుంటున్న రోజుల్లోనే ఊబకాయ సమస్య రావడంతో రిలయన్స్ సంస్థల్లో భాగస్వామ్యం కాలేకపోయారు. కానీ రిలయన్స్ సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుండేవాడు. అనంత్‌కు జంతువులంటే ఎంతో ఇష్టం.
ఇక రాధిక న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. ఇప్పుడు ఆన్కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. విరేన్ మర్చెంట్ ఆస్తి విలువ రూ.800 కోట్లు. ఇది ముఖేష్ అంబానీ ఆస్తి విలువ కంటే చాలా రెట్లు తక్కువ.
భారీగా పెళ్లి ఏర్పాట్లు..!
ఇక అంబానీ ఇంట పెళ్లి వేడుక అంటే స్వర్గ లోకమే కిందికి వచ్చినట్లు ఉంటుంది. ముంబైలోని ఆంటీలియాలోనే దాదాపు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కానీ అనంత్ వివాహం కోసం మాత్రం గుజరాత్‌లోని జామ్ నగర్లో ఉన్న రిలయన్స్ గ్రీన్స్‌ను ఎంపికచేసుకున్నారు. ఇందుకు కారణం అనంత్ ఓ సందర్భంలో వివరించాడు. గుజరాత్ తన తల్లి జన్మభూమి.. తండ్రి కర్మభూమి అని అందుకే అక్కడ వివాహం చేసుకోవాలనుకున్నానని తెలిపాడు.
దాదాపు ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, కుబేరులు, సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేసారు. ప్రముఖ ఇంటర్నేషనల్ సింగర్ రిహాన్నా తొలిసారి భారత్‌లో అడుగుపెట్టి అనంత్ రాధికల వివాహ వేడుకలో పెర్ఫామ్ చేసింది. ఇందుకోసం రిహాన్నాకు రూ.70 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
2800 రకాల వంటకాలు
వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2800 రకాల వంటకాలను తయారు చేయించారు. అంతేకాదు.. అతిథుల్లో ఎవరు వీగన్ డైట్ చేస్తున్నారో తెలుసుకుని మరీ వారి కోసం ప్రత్యేకంగా వంటలు కూడా చేయించారు. వంటల కోసం ఏకంగా 25 మంది చెఫ్‌లను నియమించారు.
రూ.1000 కోట్ల వివాహం..!
అనంత్, రాధిక వివాహానికి అంబానీ దంపతులు చేసిన ఖర్చు దాదాపు రూ.1250 కోట్లని తెలుస్తోంది. అతిథులను పికప్ చేసుకోవడానికే రోల్స్ రాయిస్ కారును పంపించారంటే ఇక వారికి ఆతిథ్య సేవలు ఏ రేంజ్లో ఉండి ఉంటాయో అర్థం చేసుకోండి.
జామ్ నగర్లో అనంత్ అంబానీ వంతారా (Vantara) అనే పేరుతో ఓ జూ ను ఏర్పాటు చేసారు. తనకు జంతువుల పట్ల ఎంత అమితమైన ప్రేమ ఉందో ఈ జూకి వెళ్తే తెలుస్తుంది. వివాహ వేడుకలో భాగంగా సెలబ్రిటీలకు ఈ వంతారా జూలో జంగిల్ సఫారీ ఏర్పాటు చేసారు. ఇందుకోసం అతిథులకు స్పెషల్‌గా జంగిల్ థీమ్ ఉన్న దుస్తులు వేసుకోవాలని చెప్పారట. అతిథులు కేవలం పెళ్లికి మాత్రమే హాజరయ్యారు. మిగతావన్నీ కూడా అంబానీలే ఏర్పాటుచేసారు. ప్రత్యేకంగా అప్పటికప్పుడు దుస్తులను డిజైన్ చేయించే దగ్గర నుంచి కావాలసిన మేకప్ సామాగ్రి వరకు అన్నీ వారే సమకూర్చారు.
హస్తాక్షర్ వేడుకతో ముగింపు
అనంత్, రాధికల మూడు రోజుల పెళ్లి వేడుక హస్తాక్షర్ కార్యక్రమంతో ముగిసింది. హస్తాక్షర్ వేడుకక కోసం అందరూ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. వేద పండితుల సమక్షంలో తమ జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభిస్తున్నట్లుగా ఇద్దరూ సంతకాలు చేసే కార్యక్రమాన్నే హస్తాక్షర్ అంటారు. ఈ వేడుక అనంతరం అంబానీ కుటుంబీకులు గ్రాండ్‌గా మహా హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. సింపుల్‌గా చెప్పాలంటే హస్తక్షర్ అంటే ఓ రిజిస్టర్ మ్యారేజ్ లాంటిది. ఈ వేడుక ముగిసిన తర్వాత వంతేరా నివాస్‌లో పోస్ట్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటుచేసారు. ఈ పార్టీలో ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు ఏకాన్తో పాటు మన భారతీయ గాయకులైన సుఖ్బీర్, హార్డీ సంధులు తమ పెర్ఫామెన్స్‌తో అలరించారు.
టాలీవుడ్ నుంచి చరణ్ మాత్రమే..!
ఇక టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన (Upasana) దంపతులకు మాత్రమే అంబానీల ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. వారి ఆహ్వానాన్ని మన్నించి చరణ్, ఉపాసనలు ఈ వేడుకలో భాగస్వామ్యులయ్యారు.