Varalakshmi Sarathkumar: ఘనంగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ నిశ్చితార్ధం

Varalakshmi Sarathkumar: ప్ర‌ముఖ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ నిశ్చితార్ధం ఘ‌నంగా జ‌రిగింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రిస్ట్ నికోలాయ్ స‌చ్‌దేవ్‌తో (Nicholai Sachdev) ఇంట్లోవారి స‌మ‌క్షంలో వీరి నిశ్చితార్ధ వేడుక జ‌రిగింది. విల‌న్‌గా తెలుగు, త‌మిళం సినిమాల్లో న‌టిస్తూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వ‌ర‌ల‌క్ష్మి. ఒక పదేళ్ల క్రితం వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మి.. న‌టుడు విశాల్‌తో  (Vishal) డేటింగ్‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత త‌మిళ‌నాట రాజ‌కీయాల కార‌ణంగా వీరి మ‌ధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దాంతో ఇద్ద‌రూ విడిపోయారు. అప్ప‌టి నుంచి ఆమె కేవ‌లం సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయారు. ఇక ఆమె వివాహం చేసుకోరేమో అనుకున్నారు కానీ మొత్తానికి త‌న ప్రియుడిని ఫ్యాన్స్‌కి చూపించేసారు.