Ankita Lokhande: సౌత్ నిర్మాతతో పడుకోవాలన్నారు
Ankita Lokhande: ప్రముఖ హిందీ సీరియల్ నటి అంకిత లోఖాండే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ఘటనను ఎదుర్కొన్నానని అన్నారు. ఓ సౌత్ దర్శకుడు తనతో సినిమా చేస్తానని చెప్పాడని.. ఇందుకు తాను కూడా ఒప్పుకున్నానని అన్నాడు. ఆడిషన్స్ ముగిసాక రెండో రోజే చెక్ తీసుకోవడానికి రమ్మన్నారని అప్పుడు చాలా సంతోషించానని తెలిపింది. అయితే కొత్త వారికి ఇంత త్వరగా ఎలా అవకాశం వస్తుందా అన్న సందేహంతోనే తన కోఆర్డినేటర్‌తో కలిసి ఆ దర్శకుడి ఇంటికి వెళ్లానని.. అప్పుడు కోఆర్డినేటర్‌ను బయట కూర్చోమని చెప్పి తనను మాత్రమే లోపలికి రమ్మన్నారని పేర్కొంది. (Ankita Lokhande)
తీరా లోపలికి వెళ్తే.. ఈ సినిమాలో అవకాశం కావాలంటే నిర్మాతతో పడుకోవాలని చెప్పారని.. దాంతో తనకు ఒళ్లు మండి మీకు ట్యాలెంట్ ఉన్న అమ్మాయి కాదు కేవలం అమ్మాయి కావాలి. నేను అలాంటిదానిని కాను అని చెప్పి బయటికి వచ్చేసానని వెల్లడించింది. “””” నాకు 19 ఏళ్ల వయసున్నప్పుడు ఓ సౌత్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. నేను ఆశతో వెళ్లాను. ఆడిషన్ ఇచ్చాను. నన్ను ఎంపికచేసినట్లు రెండు రోజులకే ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి సైన్ చెన్ తీసుకోవాలని చెప్పారు. నేను ఇదే విషయాన్ని మా అమ్మకు చెప్పి ఎంతో సంతోషించాను. కానీ మనసులో ఎక్కడో తెలీని సందేహం. నన్ను రెండు రోజుల్లోనే ఎలా ఎంపికచేసారా అని. అయినా కూడా దేవుడిపై నమ్మకం ఉంచి నా కోఆర్డినేటర్‌తో కలిసి ఆ నిర్మాత ఇంటికి వెళ్లాను. నా కోఆర్డినేటర్‌ను బయట కూర్చోవాలని చెప్పి నన్ను మాత్రమే లోపలికి రమ్మన్నారు. సరే అని వెళ్లాను. అక్కడ ఆ నిర్మాత తరఫు సహాయకుడు నాకు చెక్ ఇవ్వడానికి ముందు నిర్మాతతో పడుకోవాలని చెప్పాడు. అది విని నాకు కన్నీళ్లాగలేదు “”””” అని అంకిత వెల్లడించింది.
అంకిత లోఖాండే ఎవరో కాదు.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput) మాజీ ప్రేయసి. వీరిద్దరూ కలిసి హిందీలో పవిత్ర రిష్తా అనే సీరియల్‌తో తమ కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ సమయంలో ఈ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడే వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. సుశాంత్‌తో పెళ్లి కోసమే అంకిత పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా వదులుకుంది.
కానీ సుశాంత్‌కి కూడా అప్పటికే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మెల్లిగా అతను యంగ్ సూపర్‌స్టార్ అయిపోయాడు. బాలీవుడ్లో అతనికి క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. అదే సమయంలో సుశాంత్‌కి అంకితకు మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. సుశాంత్ తనకు పెళ్లి చేసుకోవాలని లేదని కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని అంకితతో చెప్పాడట. దాంతో అతని నిర్ణయాన్ని గౌరవించి అంకిత కూడా అతని జీవితం నుంచి తప్పుకుంది. కానీ ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తి అనే మరో నటితో డేటింగ్లో ఉన్నాడు. రియాతో ప్రేమలో ఉన్నప్పుడే 2020 జూన్ నెలలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.