Anant Radhika Wedding: అట్టహాసంగా మొదలైన అంబానీ ఇంటి వేడుక
Anant Radhika Wedding: ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది..
గత నెల 28 నుంచి ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఫంక్షన్ కు వచ్చే అతిథుల లిస్ట్ లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీసీఈఓ బాబ్ ఇగర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ ఉన్నారు. అల్ జబర్కూడా వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు, ఈల రోత్స్ చైల్డ్ ఛైర్మన్ లిన్ ఫారెస్టర్ డి రోత్స్ చైల్డ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, టెక్ ఇన్వెస్టర్ యూరి మిల్నర్, భూటాన్ రాజు-రాణిలకు కూడా అంబానీ కుటుంబం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.
ఇక వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు క్రీడలు, బాలీవుడ్, సైన్స్, జర్నలిజం, సామాజిక సేవకు సంబంధించిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జామ్‌నగర్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని, వారు ఇద్దరు కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్ళబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ పూర్తి అయిన తరువాత రోజు అతిథులతో జంగల్ సఫారీ ఈవెంట్ ఉండబోతుంది. ఆ నెక్స్ట్ డే జామ్‌నగర్ ప్రకృతి అందాలను అతిథులకు చూపించనున్నారు.
వివాహానికి ముందు జరిగే కార్యక్రమంలో గుజరాత్‌లోని కచ్ – లాల్‌పూర్‌కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అతిథులకు అందజేస్తారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వివాహానికి ముందు జరిగే వేడుకకు దాదాపు 1000 మంది అతిథులు హాజరుకానున్నారు. అతిథుల కోసం ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విమానాలు ఢిల్లీ, ముంబై నుండి జామ్‌నగర్‌కు వస్తాయి. జామ్‌నగర్ నుండి ఈ నగరాలకు తిరిగి వెళ్తాయి. మార్చి 1న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విమానాలు అందుబాటులో ఉంటాయి.
వధువు వివరాలివే..
రాధిక వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె. వీరేన్ మర్చంట్ గుజరాత్‌లోని కచ్ నివాసి. ఆయన ఏడిఎఫ్ ఫుడ్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాగే ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్’ సీఈఓ, వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ట్రెక్కింగ్ – స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ ఆధ్వర్యంలో రాధిక క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది.