Damodar Rajanarsimha: కేటీఆర్‌తో సెల్ఫీకి పోటీప‌డిన కాంగ్రెస్ నేత‌లు

Damodar Rajanarsimha: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిష‌ వివాహ వేడుక నిన్న ఫిలిం న‌గ‌ర్‌లోని JRC క‌న్వెన్ష‌న్ హాల్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలతో పాటు ప‌లువురు BRS నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. అయితే KTR మండ‌పానికి వ‌స్తున్న స‌మ‌యంలో ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది.