Krish Jagarlamudi: డ్రగ్స్ కేసు.. పరారీలో క్రిష్..?
Krish Jagarlamudi: ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్లో డ్రగ్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటికి వస్తున్నాయి. వారిలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారో అని భయపడి క్రిష్ ముందు జాగ్రత్తతో తెలంగాణ హై కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన రెండు రోజుల నుంచి కనిపించడంలేదని పరారీలో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
డ్రగ్స్ కేసులో భాగంగా ఆయన రెండు రోజుల క్రితమే విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు హాజరుకావడానికి తనకు కొంచెం సమయం కావాలని అడిగారట. ఏ తప్పూ చేయనప్పుడు సమయం ఎందుకు? తప్పు చేసారు కాబట్టే సమయం కావాలన్న సాకుతో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తున్నారు. ఆ బెయిల్ ఎప్పుడు విచారణకు వస్తుందో తెలీదు కాబట్టి ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. (Krish Jagarlamudi)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రిష్ ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి క్రిష్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా రీచ్ అవ్వడంలేదట. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 9 మంది పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసారు. వారిలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడు కూడా ఉన్నారు. లిసా అనే మోడల్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ లిసా అనే యువతి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత నుంచి కనిపించకుండా పోయిందని ఆమె సోదరి ఫిర్యాదు చేసారు.
ALSO READ: Shanmukh: ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. డ్రగ్స్‌కి బానిసై..!
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే హైదరాబాద్‌లో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని కాస్త గట్టిగానే హెచ్చరించారు. సాధారణ డ్రగ్స్ కేసులు కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్న వారు ఉన్నారని.. టాలీవుడ్ పెద్దలు వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి చోద్యం చూస్తూ కూర్చోవడం సబబు కాదని మండిపడ్డారు. డ్రగ్స్ సేవించాలనుకునేవారు కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్లిపోయి అక్కడ చేసుకోవాలని అంతేకానీ హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే ఈసారి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
కొన్నిరోజుల క్రితం యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కూడా డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు. తన సోదరుడు వినయ్ సంపత్‌ను చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసేందుకు నార్సింగిలోని ఆయన నివాసానికి వెళ్లగా.. అక్కడ షణ్ముఖ్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ సమయంలో షణ్ముఖ్ ఏడుస్తూ తాను డిప్రెషన్లో ఉన్నానని.. ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నానని ఆ బాధ నుంచి తేరుకోవడానికే డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని బుకాయించాడు. ఆ తర్వాత దిలీప్ సుంకర బెయిల్‌పై షణ్ముఖ్‌ను విడిపించాడు. మరి ఇప్పుడు క్రిష్ జాగర్లమూడికి కూడా దిలీప్ సుంకర బెయిల్ ఇప్పిస్తారో లేదో చూడాలి.