Horse Shoe: గుర్ర‌పు నాడ ఉండ‌టం మంచిదేనా? కోటీశ్వ‌రులైపోతారా?

Horse Shoe: చాలా మంది ఇళ్ల‌ల్లో గుర్ర‌పు నాడ ఉంటుంది. కానీ అది ఎందుకు పెట్టుకుంటారో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా? గుర్ర‌పు నాడ అంటే గుర్రాల‌కి నాడాలేసే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ గుర్రం వాడి అరిగిపోయిన త‌ర్వాత ఆ నాడాల‌ను తీసేస్తారు. గుర్రం వాడిన నాడా మాత్ర‌మే ఇంట్లో పెట్టుకోవాలి. దానికి ఒక శ‌నివారం రోజున శివాలయానికి తీసుకెళ్లి స్వామివారికి చూపించి మీరు ఏ కార్యం చేత‌నైతే ఈ గుర్ర‌పు నాడ‌ను ఉప‌యోగించాల‌నుకున్నారో ఆ సంకల్పం చెప్పి శ‌ని భ‌గవంతుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లి దానిని చూపించి గుమ్మానికి ఎడ‌మ ప‌క్కన క‌ట్టాలి. లేక‌పోతే గుమ్మం కింద కూడా పెట్టుకోవచ్చు. (Horse Shoe)

స్వాతంత్ర్యానికి కంటే ముందు కూడా చాలా మంది కొన్ని ప్రాంతాల్లో గృహ‌ప్ర‌వేశం చేసేట‌ప్పుడే గుర్ర‌పు నాడ‌ను కొట్టేవారు. పాత కాలంలో గుర్ర‌పు నాడ కొట్టిన త‌ర్వాతే ఇంట్లోకి ప్ర‌వేశించారు. అప్ప‌ట్లో గృహ‌ప్ర‌వేశాలు కూడా వేరే ర‌కంగా చేసేవారు. ఇంటి క‌ట్ట‌డం పూర్త‌య్యాక .. నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్న‌ట్లైతే.. అంటే కూలీలకు ఏవైనా ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు గృహ‌ప్ర‌వేశం కంటే ముందు న‌వ‌గ్ర‌హ పూజ‌లు చేసేవారు. హోమాలు, పూజ‌లు అయ్యాక మ‌రుస‌టి రోజు గృహ‌ప్ర‌వేశం చేసేవారు. గృహ‌ప్ర‌వేశానికి ముందు గుర్రపు నాడ‌ను కొట్టేవారు. ఇప్ప‌టికీ రాయ‌ల‌సీమ‌లో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

ఇలా చేస్తే ఇంటికి శ‌ని గ్ర‌హ దోషాలు అష్ట‌మ శ‌ని అర్థాష్ట‌మ శ‌ని ఏలినాటి శ‌ని దోషాలు ఏమున్నా కూడా అన్నీ తొల‌గిపోతాయి. నర‌దిష్టి, న‌ర‌పీడ‌, న‌ర ఘోష ఇవ‌న్నీ కూడా పూర్తిగా తొల‌గిపోయి ఇంటికి ప‌ట్టిన గ్ర‌హ పీడ‌ల‌న్నీ కూడా తొల‌గిపోతాయి. ఎవ‌రికైనా అష్ట‌మ శ‌ని, ఏలినాలి శ‌ని దోషాలు ఉన్న‌ట్లైతే వారి కుడి చేతి మ‌ధ్య వేలికి గుర్ర‌పు నాడ ఉంగ‌రాన్ని ధ‌రిస్తే ఆ శ‌ని భ‌గ‌వానుడి కృప ఉంటుంది. మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. మ‌న పురాత‌న కాలంలో కూడా గుర్ర‌పు నాడ‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మంచి ఆక‌ర్ష‌ణ పెరుగుతుంది. మీ కుటుంబ స‌భ్యుల‌పై ఒక‌రిపై ఒక‌రికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ మాట‌కు ఎదురులేకుండా ఉంటుంది. శ‌ని భ‌గ‌వానుడు ఐశ్వ‌ర్యాన్ని ఇస్తాడు.

గుర్ర‌పు నాడ ఉంగ‌రం పెట్టుకుంటే శ‌ని దేవుడు ఐశ్వ‌ర్య‌వంతుల్ని చేస్తాడు. ఇచ్చేదీ ఆయ‌నే తీసుకునేది ఆయ‌నే కాబ‌ట్టి ఆయ‌న శాంతిస్తే చాలు. స‌ర్వ శుభాలు చేకూర‌తాయి. ముఖ్యంగా న‌ర‌ఘోష‌, న‌ర‌పీడ వెంట‌నే తొల‌గిపోయి మీ కుటుంబంలో ఉంటున్న ప్ర‌తి ఒక్క‌రూ కూడా ఆనందంగా ఉండ‌టానికి ఈ గుర్ర‌పు నాడ బాగా ప‌నిచేస్తుంది. అవ‌కాశం ఉన్న‌వారు ఇది పెట్టుకుని చూడండి. న‌మ్మకంతో ఆచ‌రించండి. మంచి ఫ‌లితాలు వ‌చ్చి తీర‌తాయి.