Fastag KYC పూర్తి చేశారా?.. ఈరోజే లాస్ట్ డేట్

Fastag KYC: వాహనదారులకు బిగ్ అలర్ట్. మీ వాహనం ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ ఇంకా పూర్తి చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసేయండి. కేవైసీ అప్డేట్ గడవు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ లోపు పూర్తి చేయకుండా ఆ తర్వాత మీ ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

తరుచుగా జాతీయ రహదారులపై ప్రయాణాలు చేసే వాహనదారులకు ఫాస్ట్‌ట్యాగ్ కచ్చితంగా అవసరం అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా దాటేందుకు ఫాస్ట్‌ట్యాగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అనేది పూర్తి చేయాలి. లేదంటే వారి ఖాతా బ్లాక్ అవుతుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు పడాల్సి రావచ్చు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇటీవలే వన్ వెహికల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్ పాలసీ తీసుకొచ్చింది. ఫాస్ట్‌ట్యాగ్ కేవీసీ తప్పనిసరి చేసింది. మునుపటి గడువు జనవరి 31, 2024 గా ఉండేది. ఈ నెల ప్రారంభంలో ఇందుకు గడువును ఫిబ్రవరి 29వ తేదీ వరకు పొడిగించింది. అంటే ఈరోజు ఒక్క రోజు మాత్రమే ఈ గడువు ఉంది. ఇంకా ఎవరైనా కేవైసీ పూర్తి చేయకుంటే.. వెంటనే పూర్తి చేయడం మంచిది.

NHAI వెబ్‌సైట్ ద్వారా అప్డేట్ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ

ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా https://fastag.ihmcl.com పోర్టల్ లో లాగిన్ కావాలి.
డ్యాష్ బోర్డ్‌లో మై ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మై ప్రొఫైల్ పేజీలో కేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత కస్టమర్ టైప్ ఎంపిక చేసుకోవాలి.
ఆన్ స్క్రీన్ సూచనలు పాటిస్తూ మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవీసీ అప్డేట్ కోసం అవసరమైన సమాచారాన్ని అందించాలి.
అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
మీ కేవైసీ అప్డేట్ ఆమోదానికి సాధారణంగా 7 పని దినాల సమయం పడుతుంది.

బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా

మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. అందుకు ముందుగా మీ పార్ట్నర్ బ్యాంక్ వెబ్‌సైట్ లోని మీ ఫాస్టాగ్ ఖాతాలోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా సమాచారం అందించి ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ పూర్తి చేయవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా కేవైసీ అప్డేట్..

మీరు ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. అందుకు మీరు మీ పాన్ కార్డు, గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తో సమీపంలోనీ ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసిన బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాలి. అక్కడ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ ఫామ్ తీసుకుని వివరాలు అందులో నింపాలి. కావాల్సిన డాక్యుమెంట్లను జత చేసి ఆ ఫారం సంబంధిత బ్యాంక్ అధికారులకు అందజేయాలి. మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్డేట్ పూర్తయిన తర్వాత మీ మొబైల్, ఇ-మెయిల్ కి నోటిఫికేషన్ వస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్ KYC స్థితిని ఎలా తనిఖీ చేయాలి:

మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో https://ihmcl.co.in/కి వెళ్లండి.
మీ ఖాతాకు లాగిన్ చేయండి.
“నా ప్రొఫైల్” అనే ఎంపిక కోసం వెతకండి మరియు దానిపై క్లిక్ చేయండి.
ప్రొఫైల్ విభాగంలో మీ KYC స్థితిని తనిఖీ చేయండి.

మర్చిపోవద్దు, మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్ KYCని ఫిబ్రవరి 29 నాటికి అప్‌డేట్ చేయడం పూర్తి చేయాలి. మీరు చేయకపోతే, మీరు టోల్ చెల్లింపులతో సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి, అంతరాయాలను నివారించడానికి ఇప్పుడే దీన్ని చేయాలని నిర్ధారించుకోండి.