Ram Charan వద్దన్నాడు.. విజయ్ ఒప్పుకుంటాడా?
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ప్రకటించి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న మాటే బయటికి రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్నడ దర్శకుడు నార్తన్ (Narthan) చరణ్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమా కథను కూడా చరణ్ విన్నారు. ఆయన చేద్దాం అని అనడంతో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్ ముందుకొచ్చింది. కానీ ఎందుకో సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. నార్తన్ కూడా చరణ్ కోసం చాలా ఎదురుచూసారు కానీ ఆయన గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీ అయిపోవడంతో నార్తన్ కూడా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు.
అందుకే చరణ్‌తో తీయాల్సిన సినిమాను మరో హీరోతో చేసేద్దామని నార్తన్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నార్తన్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను (Vijay Devarakonda) కలిసి స్క్రిప్ట్ వివరించారట. ఇందుకు విజయ్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం విజయ్ చేతిలో ఫ్యామిలీ స్టార్ (Family Star) ఉంది. ఇది ఏప్రిల్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా ఓకే చేసాడు. ఆ తర్వాత మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లతో విజయ్ సినిమా చేయనున్నాడు. మొత్తానికి చరణ్‌కు పడాల్సిన స్టోరీ విజయ్‌కు పడేలా ఉందన్నమాట. (Ram Charan)
ALSO READ: Game Changer: ఆ పని చేయని ఏకైక టాలీవుడ్ సినిమా ఇదే..!
కన్నడలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మఫ్టీ అనే సినిమాతో తానేంటో నిరూపించేసుకున్నారు నార్తన్. ప్రశాంత్ నీల్‌తో పాటు టాప్ రేంజ్ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవం నార్తన్కు ఉంది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తే సినిమా క్లిక్ అవుతుందో లేదో అనే టెన్షన్ పెద్ద హీరోలకు కూడా ఉంటుంది. అందుకే రామ్ చరణ్ నార్తన్ సినిమాకు నో చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ALSO READ: Ram Charan: రాముడి పాత్రలో..!