Spiritual: ఎంతటి పాపాన్నైనా పోగొట్టే ప్రాయశ్చిత్త విధానాలు

Spiritual: పాపం చేసిన‌ప్పుడు వెంట‌నే శిక్ష వేసేయ‌చ్చు క‌దా.. అప్పుడు ఎవ్వ‌రూ అలాంటి త‌ప్పు చేయ‌రు క‌దా.. అంతేకానీ ఎప్పుడో ఇంకో ప‌ది సంవ‌త్స‌రాలు పోయాకో లేదా ఇంకో జ‌న్మ‌లో శిక్ష వేయ‌డం ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇలా దేవుడు ఎందుకు చేస్తాడంటే.. మ‌నం త‌ప్పుడు చేస్తే త‌ల్లిదండ్రులు ఎలా పొట్ట‌లో పెట్టుకుని అన్నీ భ‌రిస్తూ వారికి త‌ప్పు స‌రిదిద్దుకోవ‌డానికి ఎలాగైతే అవ‌కాశాలు ఇస్తుంటారో అదే విధంగా దేవుడు కూడా భ‌క్తుల‌పై ప్రేమ‌తో ఒక జ‌న్మ అనే అవ‌కాశాన్ని ఇస్తాడు.  ఎంత దారుణ‌మైన త‌ప్పు చేసినా స‌రే ఏదో ఒక ర‌కంగా దాన్ని ప్రాయ‌శ్చిత్తం చేసి ఆ త‌ప్పు నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. అందుక‌నే ఆ అవ‌కాశం ఇవ్వ‌డానికే శిక్ష‌ను వాయిదా వేస్తారు. మ‌రి ప్రాయ‌శ్చిత్తాలు ఎలా చేసుకోవాలి? శాస్త్రంలో ప్రాయ‌శ్చిత్తాలు ఉన్నాయి. (Spiritual)

*ఎవ‌రి ప‌ట్ల పాపం చేసామో అక్క‌డికి వెళ్లి ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక వ్య‌క్తి త‌న త‌ల్లిదండ్రుల‌ను వృద్ధాశ్ర‌మంలో వ‌దిలేసి వ‌చ్చాడ‌నుకోండి. ఆ త‌ర్వాత త‌న త‌ప్పు తాను తెలుసుకుని మ‌ళ్లీ త‌న తల్లిదండ్రుల‌ను ఇంటికి తెచ్చుకుని వారిని కంటికి రెప్ప‌లా చూసుకుంటే దానిని ప్రాయ‌శ్చిత్తం అంటారు.

*ఇక రెండో మార్గం ఏంటంటే.. ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాల‌నుకున్నా అందుకు అవ‌కాశం లేద‌నుకోండి.. ఎక్క‌డ త‌ప్పు చేసామో అక్క‌డికే వెళ్లి సేవ చేస్తే ఆ పాపం తొల‌గిపోతుంది.

ALSO READ: Karma: మంచివారికే ఎందుకు క‌ష్టాలు?

*కొన్ని సార్లు మ‌న‌కు తెలీకుండా కూడా పాపాలు చేస్తుంటాం. ఇవి కావాల‌ని చేసిన పాపాలు కావు కానీ త‌ప్పు జ‌రిగింది. మ‌రి అలాంట‌ప్పుడు ఏం చేయాలి? ఇలాంటివి కూడా ప‌శ్చాత్తాపంతో తొల‌గించుకోవ‌చ్చు. ఇలాంట‌ప్పుడు ఏం చేయాలంటే స‌న్మార్గంలో ఉన్న‌వారికి మీరు తెలీక చేసిన త‌ప్పుల‌ను చెప్తే ఆ పాపం పోతుంది.

*తెలిసే కాస్త పెద్ద పాపం చేసిన‌ప్పుడు దానికి ప‌శ్చాత్తాప‌ప‌డి దానిని క‌రిగించుకోవాలంటే.. ద‌గ్గ‌ర్లోని క్షేత్రాన్ని సంద‌ర్శించండి. అక్క‌డ లేని వారికి దానం చేయండి. దీంతో పాటు ప‌దివేల గాయ‌త్రి జ‌పం చేస్తే ఆ పాపం తొల‌గిపోతుంది.

*ఇంకొంచెం పెద్ద పాపం తెలిసి చేసిన‌ప్పుడు దానిని ఎలా పోగొట్టుకోవాలంటే… చాంద్రాయ‌ణ వ్ర‌తం ఫ‌లితాన్ని ఇస్తుంది. చాంద్రాయ‌ణ వ్ర‌తం అంటే ఏంటి? మొట్ట మొద‌టి అమావాస్య అయిపోయాక పాఢ్య‌మి రోజున ప్రారంభించాలి. ఆ రోజున కాస్త అన్నం ముద్ద తిని చంద్రుడికి న‌మ‌స్కారం చేసుకుని ప్ర‌దోశ వేళ ఏదో ఒక పూజ చేస్తారు. త‌ర్వాత విధియ రోజున రెండు ముద్ద‌లు తింటూ మ‌ళ్లీ ఇలాగే పూజ‌లు చేయాలి.

అలా పౌర్ణ‌మికి వ‌చ్చే స‌రికి ప‌దిహేను మ‌ద్ద‌లు తిన‌చ్చు. చంద్ర‌క‌ళ‌ల‌ను అనుస‌రించి సాయంత్రం పూట ఆహారం మితంగా తీసుకుంటూ అర్చ‌న చేయ‌డం అన్న‌మాట‌. మ‌ళ్లీ పౌర్ణ‌మి అయిపోయాక ఒక్కో ముద్ద త‌గ్గించుకుంటూ వ‌చ్చి అమావాస్య రోజున ఉప‌వాసం చేస్తే దానిని చాంద్రాయ‌ణ వ్ర‌తం అంటారు. ఈ వ్ర‌తం వ‌ల్ల మ‌నం తెలిసి చేసిన పెద్ద పాపాల‌న్నీ పోతాయి.