Alapati Rajendra Prasad: అమూల్ సంస్థకు రూ.6 వేల కోట్లు దోచిపెట్టిన జగన్

Alapati Rajendra Prasad: అనునిత్యం మోసాలతో బతికే ముఖ్యమంత్రి చివరకు రైతుభరోసా పేరుతో అన్నం పెట్టే అన్నదాతల్ని వంచించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడని, 5 ఖరీఫ్, 5 రబీల కాలాన్ని పూర్తిగా నిర్వీర్యంచేసి, వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేసిన ఘనుడిగా కూడా నిలుస్తాడని TDP సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… (Alapati Rajendra Prasad)

“”” నాగలిపట్టిన అందరికీ ప్రభుత్వ సాయం ఇవ్వకుండా.. రైతుల్లో కూడా వివక్ష చూపిన రైతు వ్యతిరేకి జగన్ రెడ్డి. చంద్రబాబు ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేస్తే, జగన్ రెడ్డి 5 ఏళ్లలో కొందరు రైతులకే రూ.37,500లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేదు. కేంద్రప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో సంబంధం లేకుండా ఏటా ప్రతిరైతు కి తన ప్రభుత్వమే రూ.13,500లు ఇస్తుందని చెప్పిన జగన్ రెడ్డి, తీరా అధికారం లోకి వచ్చాక కేంద్రం ఇచ్చే సొమ్ముకు కేవలం రూ.7,500లు మాత్రమే కలిపి రైతు లకు అందించాడు. రాష్ట్రంలో 82 లక్షల మంది రైతులుంటే, కేవలం 52 లక్షల మందికే రైతు భరోసా సాయం అందిస్తూ మిగిలిన వారిని గాలికి వదిలేసింది నిజం కాదా?

ప్రభుత్వ సాయాన్ని కూడా నాగలిపట్టిన అందరికీ కాకుండా తన పార్టీ సానుభూతిపరులకు మాత్రమే అందించి, అన్నదాతల సాయంలో కూడా వివక్ష చూపించాడు. గతంలో చంద్రబాబు ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేస్తే, జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో కొద్దిమంది రైతులకి కేవలం రూ.37,500లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నాడు. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వలేని జగన్ రెడ్డి రైతుల్ని ఉద్ధరించానని చెప్పడం హాస్యాస్పదం. వ్యవసాయానికి ముఖ్యమైన సాగు నీటిరంగానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్ రెడ్డి చేసింది శూన్యం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ను రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి నాశనం చేశాడు. రాష్ట్రంలో కరువు ఏర్పడితే, ఆఖరికి కరు వు మండలాల ప్రకటనలో కూడా జగన్ రాజకీయాలు చేశాడు.

రైతులకు అందించే ఆర్థిక సాయంలో కోతలు పెట్టిన జగన్ రెడ్డి చివరకు రైతు భరోసా కేంద్రాల సాక్షిగా అన్నదాతల్ని నిలువునా వంచించాడు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల్ని మోసగించి, వారి కష్టాన్ని దోచుకున్నాడు. కళ్లాల్లోనే ధాన్యం కొంటాను.. తేమ శాతంతో పనిలేకుండా సకాలంలో డబ్బులు చెల్లిస్తానని మాయమాటలు చెప్పి మోసగించాడు. రవాణా ఛార్జీలు, గోతాలకు డబ్బులు, తేమ శాతం అంటూ రకరకాల కారణాలతో ధాన్యం రైతుల్ని, వారి కష్టాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నా జగన్ రెడ్డి స్పందించలేదు. రూ.2,580 కోట్లు రైతులు నష్టపోయేలా జగన్ ప్రభుత్వం అరకొరగా ధాన్యం కొనుగోళ్లు జరిపింది.

ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50 పైసలకు అందిస్తానని చెప్పి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఆక్వా-నాన్ఆక్వా అని రైతుల్ని విడగొట్టి యూనిట్ విద్యుత్ ధరను రూ.5.85 పైసలకు పెంచాడు. జగన్ చర్యతో రాష్ట్రంలో ఆక్వారం గం పూర్తిగా దెబ్బతిన్నది. పంటలబీమా అమలు విషయంలో కూడా ఈ ముఖ్య మంత్రి అసెంబ్లీ సాక్షిగా అన్నీ దొంగలెక్కలు చెప్పాడు. ప్రతిపక్షనేత చంద్రబాబు రైతులకు అందించాల్సిన పంటలబీమా సాయంపై వైసీపీప్రభుత్వాన్ని నిలదీసే వరకు జగన్ రెడ్డి రైతులు తరుపున చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ముని చెల్లించలే దు. పంటలబీమా కింద రాష్ట్రవాటాగా చెల్లించాల్సిన సొమ్ము సకాలంలో చెల్లించని జగన్ రెడ్డి రైతుల పక్షపాతా? చంద్రబాబు ప్రభుత్వం డ్రిప్, స్ర్పింక్లర్ పద్ధతిలో సాగుచేపట్టే రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తే, అధికారంలోకి రాగానే జగన్ ఆ పథకాన్ని అటకెక్కించాడు. (Alapati Rajendra Prasad)

TDP ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు హార్వెస్టర్లు, రొటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్లు అందిస్తే, జగన్ సర్కార్ కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేకపోయింది. తుఫాన్లు.. అకాల వర్షాలు.. ఇతర ప్రకృతి విపత్తులవల్ల పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకో వడంలో కూడా జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. కర్ణాటక ప్రభుత్వం మిచౌంగ్ తుఫాన్ వల్ల తమ రైతాంగానికి రూ.30వేలకోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి తెలియచేస్తే, జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో జరిగిన పంటనష్టాన్ని కప్పిపుచ్చి తప్పుడు సమాచారమిచ్చాడు. రాష్ట్రంలో రూ.10వేలకోట్లకు పైగా విలువైన పంటనష్టం జరిగితే జగన్ రెడ్డి కేవలం రూ.700కోట్ల నష్టం మాత్రమే జరిగిందని చెప్పడం అన్నదాతల్ని దెబ్బతీయడం కాదా?

జగన్ రెడ్డి 4 ఏళ్ల 10 నెలల పాలనలో మొత్తంగా రాష్ట్రంలో రూ.60లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగి, 30 లక్షలకు పైగా రైతులు నష్టపోయారు. పంటచేతికి దక్కక తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు జగన్ రెడ్డి అందించిన ఇన్ పుట్ సబ్సిడీ కేవలం రూ.2వేలకోట్లు మాత్రమే. కొన్ని చోట్ల మరీ దారుణంగా ఎకరాకు రూ.32ల పరిహారం ఇచ్చారు. జరిగిన నష్టాన్ని తెలియచేసి, రైతుల పక్షాన కేంద్రాన్ని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో జగన్ రెడ్డి ఉండటం బాధాకరం. చంద్రబాబు హాయాంలో 15.30 లక్షల మంది కౌలు రైతులకు రుణమాఫీ చేస్తే, జగన్ ప్రభుత్వం కేవలం లక్షమందికి మాత్రమే చేసింది. వడ్డీలేని రుణాలకు రూ.4వేలకోట్లు, ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేలకోట్లు అందిస్తానన్నహామీలను కూడా జగన్ విస్మరించాడు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, యాంత్రీకరణ పరికరాలు అందించలేని జగన్ రెడ్డి, తన చేతగానిపాలనతో వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసి, రైతుల్ని రోడ్డున పడేశాడు.

రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి. జగన్ రెడ్డి చేతగానితనంతో, దోపిడీతో వ్యవసాయం గిట్టుబాటు కాక రాష్ట్రం లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలో నిలపడం.. కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో నిలపడమే జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో రైతులకోసం చేసిన మంచి. ఒక్కో రైతు తలపై జగన్ రెడ్డి ప్రభు త్వం రూ.2,45,554ల అప్పుభారం వేసింది. రాష్ట్రంలోని రైతులపై పడిన అప్పుల భారంతో రైతులఅప్పుల్లో కూడా ఏపీ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. అమూల్ సంస్థకు న్యాయం చేయడం కోసం ఏకంగా రూ.6వేలకోట్ల ప్రజల సొమ్ముని ఆ సంస్థకు దోచిపెట్టిన జగన్ రెడ్డి, పాడిరైతులకు ఇస్తానన్న బోనస్ ఇవ్వకుండా వారిని వంచించింది నిజం కాదా? రాష్ట్రంలోని పాల డెయిరీలకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయసహాకారాలు అందించకుండా వాటిని నిర్వీర్యం చేసింది నిజం కాదా? అబద్ధాలు.. అసత్యాలు.. మోసాలతో రైతుల్ని నిలువునా వంచించిన రైతు ద్రోహి జగన్ రెడ్డికి రైతుల పేరెత్తే అర్హత కూడాలేదు “”” అని ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. (Alapati)