Kanakamedala: TDPకి అనుకూలంగా మరో సర్వే
Kanakamedala: కుప్పం సభలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), కుప్పం ప్రజలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక వైకల్యానికి ప్రతీకగా నిలిచాయని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. మంగలవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభోత్స వం పేరిట జరిపిన సభలో ముఖ్యమంత్రి ‘కుప్పం నాడు-నేడు’ అంటూ వల్లెవేసిన అసత్యాలు, అనుచితాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
కుప్పం సభలో గంటపాటు సాగిన తన ప్రసంగంలో వందసార్లకు పైగా చంద్రబాబు పేరు తీసుకొని ఆయన్ని దూషించిన వైనం ముఖ్యమంత్రి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని సూచిస్తుందని రవీంద్రకుమార్ అన్నారు. వరుసగా 7 సార్లు భారీ మెజారిటీతో చంద్రబాబుని గెలిపించిన కుప్పం ప్రజల్ని అవమానించే విధం గా జగన్ రెడ్డి మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కుంచిత స్వభావం వెల్లడైందన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి ప్రజల్ని మభ్యపరిచే మరో ప్రయత్నం జగన్ రెడ్డి కుప్పంలో చేశారని.. ఆయన ఎన్ని పన్నాగాలు పన్నినా రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు విజయాన్ని అడ్డుకోలేరని కనకమేడల స్పష్టం చేశారు.
కుప్పం నాడు-నేడు
దీర్ఘకాలంగా కుప్పం నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు పూర్తి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తే, జగన్ రెడ్డి పాలనలో అక్కడ హింస, అరాచకాలు, ఎన్నికల అక్రమాలు విలయతాండవం చేస్తున్నాయని రవీంద్రకుమార్ తెలిపారు. పంచాయ తీ ఎన్నికల్లో అధికారపార్టీ చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు తెదేపా కార్యకర్తలపై దాడులు, ఒక ర్యాలీ సందర్భంగా చంద్రబాబుపై వైసీపీమూకల దాడి, రాజ్యాంగ వ్యవస్థను జగన్ రెడ్డి నిర్వీర్యం చేసిన తీరుని రవీంద్రకుమార్ ఉదహరించారు. ఇదేనా కుప్పం ప్రజలకు జగన్ రెడ్డి చేసిన మేలు అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని, విశ్వవిద్యాలయంతో సహా, పలు విద్యాసంస్థలు, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశారని, దేశ విదేశాల్లో కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలు విస్తృతస్థాయిలో చర్చించేలా చేశారని.. ఇవన్నీ కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధికి సజీవ సాక్ష్యాలని రవీంద్రకుమార్ వివరించారు.
దీనికి భిన్నంగా జగన్ పాలనలో కుప్పం ఆయన బృందగణం దోపిడీకి ఆలవాల మైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం కెనాల్ కట్టలు తెగిపోతే నాసి రకం పనులు చేసి వందలకోట్ల ప్రజాధనం దోచుకున్నారని, అవులపల్ల రిజర్వా యర్ నిర్మాణం పేరుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కాంట్రాక్ట్ సంస్థకు జగన్ రెడ్డి రూ.600కోట్లు దోచిపెట్టారని, రిజర్వాయర్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని వారికి నష్టపరిహారం కూడా ఇవ్వలేద ని, దీన్ని ప్రశ్నించిన మాజీ సైనికుడి ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారని రవీంద్రకు మార్ జగన్ రెడ్డి హాయాంలో జరుగుతున్న అరాచలకాలను, దోపిడీని వివరించా రు. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి, కుప్పం ప్రజలకు నీరందించాడనడం అపహాస్యంగా ఉందన్నారు.
ఎన్నికల గిమ్మిక్కు
కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.400కోట్లు ఖర్చుచేసి, 87శాతం పనులు పూర్తిచేస్తే మిగిలిన 13శాతం పనులు పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు పట్టిందని, ఎన్నికలకు ముందు సోమవారం నాడు ఆ కాలువలో చెంబెడు నీళ్లు పారించారని.. అవికూడా మంగళవారం నాడు ఆగిపోవడం ఇదంతా ముఖ్యమంత్రి చేసిన ఎన్నికల స్టంట్ గా స్పష్టమైందని రవీం ద్రకుమార్ వివరించారు.
చంద్రబాబు గెలుపును అడ్డుకోలేరు
గత 35 ఏళ్లుగా కుప్పం ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న చంద్రబాబు రానున్న ఎన్నికల్లో 8వ సారి విజయం సాధించడం తథ్యమని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుట్రలు విఫలమవుతాయని రవీంద్రకుమార్ స్పష్టంచేశారు. ఓటమిదిశలో పరుగెడుతున్న ముఖ్యమంత్రి తన పార్టీ అభ్యర్థి భరత్ ను కుప్పం నుంచి గెలిపిస్తే మంత్రిని చేస్తాననడం అపహాస్యంగా ఉందని ఆయన ఎద్దేవాచేశారు.
తెదేపాకి అనుకూలంగా మరో సర్వే
వి-ప్రిసైడ్ (V-Preside) అనే సర్వే సంస్థ సోమవారం నాడు విడుదల చేసిన లోక్ సభ ఫలితాల అంచనాల్లో.. రాష్ట్రంలో తెదేపా-జనసేన కూటమి 21 లోక్ సభ స్థానాల్లో భారీ విజయాన్ని సాధిస్తుందని, వైసీపికి కేవలం 4 స్థానాలు మాత్రమే దక్కుతాయని వెల్లడించిందని రవీంద్రకుమార్ తెలిపారు. 5 ఏళ్లుగా విధ్వంసక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఓడించడానికి రాష్ట్రప్రజలు సిద్ధమ య్యారని మరోసారి వెల్లడైందని ఆయన వ్యాఖ్యానించారు.