Viral News: మ్యాన్ హోల్లో డబ్బే డబ్బు..!
Viral News: ఒక మ్యాన్‌హోల్ కింద భారీ ఎత్తున నాణేలు, కరెన్సీ నోట్లు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సాధారణంగా భక్తులు పవిత్రమైన ప్రదేశాలలో కరెన్సీ నోట్లు, నాణేలను కానుకలుగా అందజేస్తుంటారు. అందువల్ల దేవాలయాల వంటి మతపరమైన ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా నోట్లు, కాయిన్స్ కనిపిస్తుంటాయి. కానీ ఫ్రాన్స్‌లో (France) మాత్రం ఒక మ్యాన్‌హోల్ కింద భారీ ఎత్తున నాణేలు, నోట్లు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ మ్యాన్‌హోల్‌లో డబ్బులు ఎందుకు వేశారు? అని వీడియో చూసిన నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాన్‌హోల్ ఫ్రాన్స్‌లోని, స్ట్రాస్బోర్గ్ సిటీలో ఉంది. ఈ నగరంలోని ఒక ప్రాంతంలో నేలపై ఒక మెటల్ విండో/గేటు లాంటి ఇనుప చట్రం ఉంది. ఈ ఇనుప గేటు కింద ఇళ్లకు విద్యుత్ సప్లై చేసే ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఉంది. అయితే ఇదే మెటల్ గ్రిడ్ కింద డబ్బులు నోట్లు, నాణేల రూపంలో చాలా కనిపించాయి. చూసేందుకు ఒక మనీ డిపాజిటరీగా లాగా అది కనిపించింది. (Viral News)
ALSO READ: అత్తగారి ముద్దు.. విడాకులు కావాలంటున్న కోడలు
ప్రజలు ఈ మెటల్ గ్రిడ్‌కి ఉన్న రంధ్రాల్లో కరెన్సీ నోట్లు, నాణేలు వేస్తున్నారు. అవి కింద భాగంలో పేరుకుపోతున్నాయి. అందుకే ఈ అండర్‌గ్రౌండ్ ఒక హుండీలాగా డబ్బులతో నిండిపోయింది. వైరల్ కంటెంట్ షేర్ చేసే ప్రముఖ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూనిలాడ్, ఈ మెటల్ గ్రిడ్ కింద ఉన్న డబ్బుకు సంబంధించి ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 31 వేలకు పైగా లైక్స్, 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
డబ్బులను ఇందులో ఎందుకు వేస్తున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. “ప్రమాదవశాత్తూ ఎవరైనా ఈ గ్రిడ్ కింద డబ్బులు పారేసుకున్నారేమో, అది చూసి ఇందులో డబ్బు వేస్తే మంచి జరుగుతుందని నమ్మి మిగతావారు కూడా అలాగే చేస్తున్నారేమో” అని వీడియో చూసిన నెటిజన్లు హిలేరియస్ కామెంట్లు చేశారు.
వీడియో చూస్తే, డబ్బు మెటల్ గ్రిడ్ నుంచి చాలా కింది భాగంలో ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిని దొంగిలించడం కూడా కష్టమే. ఎందుకంటే ఈ మెటల్ గ్రిడ్‌లో చిల్లులు చాలా చిన్నగా ఉన్నాయి. అయితే పెద్ద కర్రకు చివర్లో గమ్ము పెట్టి, నోట్లను పైకి తీయవచ్చని కొందరు యూజర్లు సరదాగా సలహాలు ఇచ్చారు.
ALSO READ: లాటరీలో ఒకేసారి రూ.14 వేల కోట్లు..!
ఇలాంటి మనీ గ్రిడ్ వేరే ప్రాంతాల్లో ఉంటే ఇప్పటికే దానిని దొంగలు ఎప్పుడో కొల్లగొట్టి ఉండేవారని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఏదేమైనప్పటికీ, అన్ని అధికారిక లేదా అనధికారిక పుణ్యక్షేత్రాలు తమ చుట్టూ ఉన్న డబ్బును కలిగి ఉన్నవి దొంగల నుండి సురక్షితంగా ఉండవు. రీసెంట్గా ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్ సిటీ, విక్టోరియా సెంటర్లోని ఒక ఛారిటీ ఫౌంటెన్ దగ్గర జరిగిన దొంగతనాన్ని కూడా నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. ఛారిటీ ఫౌంటెన్‌పై ప్రజలు నాణేలు విసిరేస్తారు. అయితే కొందరు దొంగరు ఈ ఫౌంటెన్‌పై పట్టపగలే దాడి చేశారు, ఆ నిందితులు కెమెరాకు కూడా చిక్కారు. ఈ చోరీని విక్టోరియా సెంటర్ ప్రతినిధి ఖండించారు. స్వచ్ఛంద విరాళాలను కోల్పోవడం, సంఘం దాతృత్వం పట్ల చూపిన అగౌరవం గురించి విచారం వ్యక్తం చేశారు. (Viral News)
ALSO READ: Money: జాబ్ లేకపోయినా మనీ..!