Dharmana Vs Subba Reddy: ఎవడ్రా నువ్వు .. ** మీద తంతా

శ్రీకాకుళం జిల్లాలో ఓ నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధి కుటుంబం భూకబ్జాలు, సెటిల్మెంట్లతో చెలరేగుతోంది. రాకరాక వచ్చిన అధికారంతో ఆ ప్రజాప్రతినిధి దోపిడీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ఖర్చుల కోసం అమ్మిన నాలుగు ఎక‌రాలు తిరిగి లాక్కోవడం ద్వారా ఆయన అరాచకపర్వం ఆరంభించారు. భూమి కొనుగోలుదారుల్ని పిలిపించి తన భూమి తనకు వెనక్కి ఇస్తారా? కేసులు పెట్టించమంటారా? అని భయపెట్టారు. ఎందుకొచ్చినగొడవంటూ కొనుగోలుదారులు నామమాత్రపు డబ్బు తీసుకుని ఆ భూమి పత్రాలు ప్రజాప్రతినిధికి తిరిగి ఇచ్చి వెళ్లిపోయారు.

నియోజకవర్గ కేంద్రంలోని ప్రఖ్యాత మఠం భూములపైనా ఆయన కన్నుపడింది. 300 ఎకరాల మఠం భూముల్లో కొంత భాగం పలువురు స్థిరాస్తి వ్యాపారులు ఇతర వ్యక్తుల చేతుల్లో ఉంది. ఆ ప్రజాప్రతినిధి సంబంధిత వ్యక్తుల్ని పిలిపించారు. తనకు 25 శాతం వాటా ఇవ్వాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆయనతో వేగలేక కొందరు దండం పెట్టేశారు. 3ఎకరాలను 10కోట్ల రూపాయలకే ముట్టజెప్పారు. అక్కడ ఎకరా 10 కోట్ల రూపాయలపైనే పలుకుతుండడంతో తమ వాటా ఇవ్వటానికి కొందరు నిరాకరించారు. నేను అడిగిందే కాదంటారా అని స్థలం ఇవ్వని వారి అపార్ట్‌మెంట్లకు కరెంటు కట్‌ చేయించి తన ప్రతాపం చూపించారు. తన చేతికి మట్టి అంటకుండా చేసే అరాచకాలకూ అంతేలేదు.