Lasya Nandita: డ్రైవర్ వాంగ్మూలంలో షాకింగ్ వివరాలు
Lasya Nandita: సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే లాస్య నందిత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె డ్రైవర్ ఆకాశ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. లాస్య నందిత కేసులో తమకు డ్రైవర్ ఆకాశ్‌పై అనుమానాలు ఉన్నాయని నందిత సోదరి నివేదిత పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆకాశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసారు. మెజిస్ట్రేట్ సమక్షంలో ఆకాశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసారు. వాంగ్మూలంలో ఆకాశ్ షాకింగ్ అంశాలను వెల్లడించారు.
ALSO READ: Lasya Nandita మృతి కేసులో ట్విస్ట్..!
కారులోని లాస్య అక్క నివేదిత కూతురును వేరే కారులోకి ఎక్కించి అని ఆకాశ్ వాంగ్మూలంలో తెలిపాడు. తినడానికి వెళ్దామంటే హోటల్ వెతుక్కుంటూ వెళ్లామని ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగిందని అన్నాడు. ప్రమాదంలో ఎలా జరిగిందో అర్థంకావడంలేదని అన్నాడు. ఇక్కడ అనుమానం కలిగిస్తున్న అంశం ఏంటంటే.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆకాశ్ నివేదితకు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పి.. తనకు లాస్య నందితకు గాయాలయ్యాయని సమాచారం అందించాడు. ఆ తర్వాత ప్రమాద స్థలానికి రావాల్సిందిగా లొకేషన్ పంపింది కూడా ఆకాశే. కానీ పోలీసుల ముందు మాత్రం ప్రమాదం ఎలా జరిగిందో తెలీదని అనడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అందుకే నివేదిత అనుమానంతో ఫిర్యాదు చేసారు. ప్రమాదం జరిగిన రోజు లాస్య నందిత కుటుంబీకులు సదాశివపేటలో ఉన్న ఒక దర్గాకు వెళ్లి అక్కడ తాయత్తులు కట్టించుకుని పూజలు చేసారు. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడం.. ఏదో ఒక సమస్య ఎదురుకావడం.. లిఫ్ట్‌లో ఇరుక్కోవడం.. నల్గొండ వెళ్లి వస్తుంటే యాక్సిడెంట్ అవ్వడం.. గతేడాది తండ్రి సాయన్న చనిపోవడం.. ఇలా చాలా జరుగుతుండడంతో వారు దర్గాకు వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి ఇంటికి పయనమైన సందర్భంలో ఒక వాహనం నేరుగా సికింద్రాబాద్‌లోని ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో లాస్య నందిత అక్క నివేదిత కూతుర్ని తమ వాహనంలో నుంచి ఇంటికి వెళ్తున్న వాహనంలోకి ఎక్కించారు. ఆ తర్వాత లాస్య నందిత, డ్రైవర్ ఆకాశ్ హోటల్ వెతుక్కుంటూ వెళ్లాం అని ప్రస్తుతం వాంగ్మూలంలో రికార్డ్ అయింది. ఇంత వరకు మాత్రమే ఆకాశ్ వెల్లడిస్తున్నాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ ఎలా అయ్యిందో తెలీడంలేదు అని అంటున్నాడు.
ఆకాశ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. మరోసారి ఆకాశ్‌ను విచారణ చేసే అవకాశం కూడా ఉంది. ఆకాశ్ ఇచ్చిన వాంగ్మూలం.. మరోపక్క లాస్య నందిత సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం విచారణ జరగనుంది. అతను ప్రస్తుతం ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు కాబట్టి పోలీసులు కూడా లోతుగా విచారించలేకపోయారు. ఇంకాస్త కోలుకున్నాక పూర్తి స్థాయిలో విచారణ చేపడతారు. అప్పుడు ఆకాశ్ ఇదే వాంగ్మూలం ఇస్తాడా లేక మార్చి చెప్తాడా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. లాస్య నందిత మద్దతుదారులు, అభిమానులు డ్రైవర్ ఆకాశ్‌కు నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు జరిగిన ప్రమాదంలో ఇతనే డ్రైవర్‌గా ఉన్నాడని.. దాంతో లాస్యకు ప్రమాదం సహజంగా జరిగినట్లు అనిపించడంలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Lasya Nandita: లాస్య నందితని వెంటాడిన ప్రమాదాలు
లాస్య నందిత కుటుంబీకుల్ని ఓదార్చేందుకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆమె నివాసానికి వెళ్లారు. ఏ సాయం కావాలన్నా ముందుంటాం అని హామీ ఇచ్చారు. KTRను చూడగానే లాస్య తల్లి, అక్క బోరున విలపించారు.