స‌ల్మాన్ ఖాన్ సినిమాలో బ‌తుక‌మ్మ పాట!

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం కిసీకా భాయ్ కిసీకీ జాన్. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు మార్కెట్‌లోనూ రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ సాంగ్‌ను రిలీజ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ఆడ‌ప‌డుచుల‌ సంప్ర‌దాయ పండుగైన బ‌తుక‌మ్మ గొప్ప‌త‌నాన్ని చెబుతూ ఈ పాట‌ను రాసారు. తెలంగాణ పండుగ‌ను బాలీవుడ్ చిత్రంలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించ‌డం ఆక‌ట్టుకుంటోంది. స‌ల్మాన్, వెంకీ తెలుగు సంప్ర‌దాయ‌మైన పంచ‌క‌ట్టులు ధ‌రించి పాట‌కే హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పాట‌లో వెంకీ, పూజా హెగ్డేతో ప‌లువురు తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఫ‌ర్హాద్ సంజీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 21న సినిమా రిలీజ్ అవ‌బోతోంది.